హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ బిసిలకు ప్రాధాన్యత ఇస్తుందని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడు అని తెలిపారు. కాబట్టి హుజురాబాద్ లో టీఆరెస్ అభ్యర్థికి అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు.
బిజిపి గెలిస్తే రెండు.. పోయి మూడు మాత్రమే అవుతాయన్నారు.. అభివృద్ధి టీఆరెస్ తోనే సాధ్యమని.. దళిత బంధు పై కొందరు, తల మోకాళ్ళలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో సాంప్రదాయాలు పాటించాలన్నారు. కొందరి భాష వల్ల ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే ప్రజలు చులకన అవుతున్నారని మండిపడ్డారు.. ముఖ్యమంత్రి ని ఏకవచనం తో మాట్లాడుతున్నారని.. హైదరాబాద్ లో పుట్టి పెరిగింది మేమని గుర్తు చేశారు.. మా కన్నా బలవంతులు ఉంటారా ? మేం అనుకుని, ఆలోచిస్తే మరోలా ఉంటుందని చురకలు అంటించారు.. మేం మాట్లాడగలం, అన్ని విధాలుగా రెడీగా ఉన్నాం.. కానీ బాధ్యతగా ఉంటున్నామన్నారు. జైలుకు వెళ్లిన వాళ్లే జైలు గురించి మాట్లాడుతున్నారని..మండిపడ్డారు.