జరగండి జరగండి సాంగ్ ఆ సాంగ్ కు కాపీనా.. థమన్ పై విపరీతమైన ట్రోల్స్

-

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గేమ్ చేంజర్ రాంచరణ్ నటిస్తున్నటువంటి 15వ చిత్రం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుండి జరగండి.. అనే లిరికల్ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే.అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, ప్రభుదేవా కొరియోగ్రఫీ సమకూర్చారు. కాని థమన్ మ్యూజిక్ మాత్రం శంకర్ స్థాయిని , ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేదు.ఈ పాటకి తమన్ ఇచ్చిన ట్యూన్స్ కూడా కాపీ సాంగ్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.జరగండి.. సాంగ్ ప్రారంభం శక్తి మూవీలోని ఒక సాంగ్ ట్యూన్ కి దగ్గరగా ఉంది. ఎన్టీఆర్-ఇలియానా నటించిన శక్తి చిత్రంలో సుర్రా సర్రన్నాదే అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ వలే ఉందని అంటున్నారు ఆడియన్స్.

Read more RELATED
Recommended to you

Latest news