కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండ్లలో ఉంటున్న చిన్నారుల కోసం జీ గ్రూప్ కొత్తగా జీ5 కిడ్స్ పేరిట ఓ నూతన యాప్‌ను లాంచ్ చేసింది. వూట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాగానే ఈ యాప్‌లోనూ చిన్నారుల కోసం ప్రత్యేకమైన కంటెంట్‌ను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో మొత్తం 4వేల గంటల నిడివి గల కంటెంట్ ఇప్పుడు జీ5 కిడ్స్‌లో చిన్నారులకు ఉచితంగా అందుబాటులో ఉందని.. ఆ కంపెనీ తెలిపింది.
జీ5 కిడ్స్ యాప్‌లో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మరాఠీ, తమిళ్, కన్నడ, బెంగాళీ, మళయాళం, భోజ్‌పురి తదితర భాషలకు చెందిన కంటెంట్ అందుబాటులో ఉంది. త్వరలోనే లయన్స్‌గేట్‌కు చెందిన మరింత కంటెంట్‌ను ఈ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. ఇక జీ5 ను పూర్తిగా చిన్నారులకు ఫ్రెండ్లీగా ఉండేలా తీర్చిదిద్దారు. అందువల్ల ఇందులో సులభంగా వీడియోలను వెదకడంతోపాటు సౌకర్యవంతంగా వాటిని చూడవచ్చు. అలాగే చిన్నారులు సురక్షితంగా కంటెంట్‌ను వీక్షించేలా పెద్దలకు పలు ప్రత్యేకమైన పేరెంట్ కంట్రోల్స్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.
జీ5 కిడ్స్‌లో పెద్దలు వైద్య నిపుణులతో చాట్ చేసి చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే వారికి అందించాల్సిన పోషకాహారంపై న్యూట్రిషనిస్టులతో మాట్లాడవచ్చు. ఈ సందర్బంగా జీ5 ప్రొగ్రామింగ్ హెడ్ అపర్ణ అచ్రేకర్ మాట్లాడుతూ.. జీ5 కిడ్స్ ద్వారా చిన్నారులకు ఎంతో ఉపయోగమైన కంటెంట్‌ను ఉచితంగా అందించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో వారి కోసం మరింత కంటెంట్‌ను, మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అందులో ఉంచుతామని తెలిపారు.