లాక్ డౌన్ లో హెయిర్ కట్ కి వెళ్ళిన పది మందిని పోలీసులు ఏం చేసారంటే…!

-

కరోనా వైరస్ ఉంది రా బాబూ బయటకు రావొద్దు నాయనా అని ఎలా చెప్పినా సరే ఎవరూ కూడా వినే పరిస్థితి లేదు అనేది అర్ధమవుతుంది. రోజు రోజుకి కరోనా తీవ్రత దేశంలో పెరగడంతో లాక్ డౌన్ ని పోలీసులు కఠినం గా అమలు చేస్తున్నారు. ప్రజలకు చాలా వరకు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. అయినా సరే కొందరి లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. తాజాగా కొంత మంది లాక్ డౌన్ ని దారుణంగా ఉల్లంఘించారు

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సెలూన్లో హెయిర్ కటింగ్, షేవింగ్ కోసం పది మంది గుమిగూడారు. అదే విధంగా ఇంటి బయట తినుబండారాలు అమ్ముతున్న ఇద్దరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా సోకిన వారి సంఖ్య అక్కడ 600 దాటినా సరే పోలీసుల మాటలను జనం లెక్క చేసే పరిస్థితి ఉండటం లేదు. దీనితో విజయ్ రూపాని ప్రభుత్వం… అహ్మదాబాద్ నగరాన్ని రెడ్ జోన్‌లో చేర్చింది.

నగరంలోకి పలు ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. అహ్మదాబాద్ లోని ఖోడియనగర్ సొసైటీ ఎదుట అంకిత్ అనే సెలూన్లో హెయిర్ కటింగ్, షేవింగ్ కోసం 10 మంది గుమిగూడగా పోలీసులు గమనించారు. అక్కడ పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ వారిని గుర్తించారు. ఒకే షాపులో ఉన్న పది మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version