ఉక్రెయిన్ యుద్ధంపై మస్క్ ట్వీట్.. జెలెన్‌స్కీ స్ట్రాంగ్ రిప్లై

-

ఉక్రెయిన్ యుద్ధంపై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఉక్రెయిన్ లో శాంతి నెల‌కొల్పాలంటే ఏం చేయాలో ఎలాన్ మస్క్ తన ట్వీట్ లో పేర్కొన్నారు మస్క్.

ర‌ష్యా ఇటీవ‌ల నాలుగు ప్రాంతాల్లో రెఫ‌రెండం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వివాదాస్ప‌ద ప్రాంతాల్లో యూఎన్ నేతృత్వంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, అక్క‌డ ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పును ఇరు దేశాలు ఆమోదించాల‌ని ఓ ట్వీట్‌లో మ‌స్క్ తెలిపారు. క్రిమియా ప్రాంతాన్ని ర‌ష్యా అధికారిక భూ భాగంగా గుర్తించాల‌ని, ఆ ప్రాంతానికి నీట స‌ర‌ఫ‌రాను పున‌రుద్ద‌రించాల‌ని చెప్పారు.

మ‌స్క్ ట్వీట్లు చేసిన వెంట‌నే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. మీకు ఈ రెండింటిలో దేన్ని ఇష్ట‌ప‌డతార‌ని జెలెన్‌స్కీ ప్ర‌శ్నించారు. మీరు ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ఇస్తారా అని ఓ ప్ర‌శ్న‌, ర‌ష్యాకు మ‌ద్ద‌తు ఇస్తారా అని మ‌రో ప్ర‌శ్న వేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version