ZIM AFRO T10 LEAGUE: యూసఫ్ పఠాన్ తుఫాన్ ఇన్నింగ్స్ … 20 బంతుల్లోనే 80 పరుగులు !

-

జింబాబ్వే ఆఫ్రికా టీ 10 లీగ్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో సంచలనం నమోదు అయింది. క్వాలిఫైర్ 1 లో డర్బన్ కలండర్స్ మరియు జోబర్గ్ బఫెల్లౌస్ మధ్యన మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు నిర్ణీత ఓవర్ లలో వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఇందులో ఫ్లెచర్ 39 పరుగులు చేయగా, ఆసిఫ్ అలీ 32 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ ను అందించారు. అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన జోబర్గ్ జట్టు మొదట్లోనే హఫీజ్, బాంటన్, స్మిడ్ లు తక్కువ స్కోర్ లకే అవుట్ అయ్యారు. ఇక టీం ఓడిపోతుంది అని అంతా అనుకున్నారు, కానీ అప్పుడే ఇండియా మాజీ డేంజరస్ ప్లేయర్ యూసఫ్ పఠాన్ రంగంలోకి దిగాడు. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను కాస్త.. మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించి సగౌరవంగా ఫైనల్ కు చేర్చాడు.

ఇతని ఇన్నింగ్స్ లో 26 బంతుల్లో 4 ఫోర్లు మరియు 9 సిక్సులు సహాయంతో 80 పరుగులు చేయడం విశేషం. ఇక పాకిస్తాన్ బౌలర్ అమీర్ వేసిన ఒక ఓవర్లో 24 పరుగులు సాధించి అతనికి చుక్కలు చూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news