కెనడాలో ప్రాణాంతకమైన ‘ జాంబీ’ వైరస్… జింకల్లో ప్రబలుతున్న వైరస్

-

ప్రపంచాన్ని కలవర పెట్టే వార్త. మనం ఇంతకుముందు జాంబీ వైరస్ సంబంధించిన సినిమాలను చూసే ఉంటాం. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూశాం.  తాజాగా తెలుగులో జాంబీ రెడ్డి పేరుతో కూడా జాంబీ జోనర్ లో సినిమా వచ్చింది. అయితే ఇదంతా తెరపైన కథ. తాజాగా కెనడాలో నిజంగానే జాంబీ వైరస్ వ్యాపిస్తోంది. అక్కడి జింకల్లో ఈ వ్యాధి ప్రబలుతోంది. 

కెనడాలో అత్యంత భయంకరమైన జాంబీ వైరస్ ప్రజలుతోంది. కెనాడాలోని పలు జింకల్లో ఈ వ్యాధిని చూశారు. ఈ వ్యాధి సోకిన జింకలు వేరే జింకలను చంపి తింటున్నాయి. క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ (CWD) అని ఈ వ్యాధిని పిలుస్తారు. జింకల్లో ఈ జాంబీ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కెనడాలోని అల్బెర్టా, సస్కట్చేవాన్‌ ప్రావిన్సుల్లో ఈ వ్యాధి కనిపిస్తోంది. 1960 చివరలో ఓ జింకలో ఈ వ్యాధిని కనుకున్నారు. ఆ తరువాత 1981లో కొలరాడోలోని ఈ వ్యాధిని నమోదు చేశారు. ప్రస్తుతం కెనడాలో ఈ వ్యాధి అల్బెర్టా కనిపించింది. అయితే అంతకుముందు 2005లో కూడా జింకల్లో ఈ వ్యాధిని మొదటిసారిగా నిర్థారించారు. ప్రస్తుతం ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక వేళ జింకలకు జాంబీ టెస్ట్ పాజిటివ్ గా వస్తే అటువంటి జింకల మాంసాన్ని తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version