జగన్‌పై ఇంత నెగిటివ్ ఉందా? ఆ ఫలితాలే సెట్ చేస్తాయా?

-

ఏపీలో అత్యంత బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం జగన్ మాత్రమే. ఇప్పుడు ఆయనకు ఉన్న ప్రజా మద్ధతు రాష్ట్రంలో మరో నాయకుడుకు లేదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ప్రజా మద్ధతు ఏపీ చరిత్రలో మరో నాయకుడుకు ఇంతవరకు రాలేదనే చెప్పొచ్చు. అంత ప్రజా మద్ధతుతో అధికారంలోకి వచ్చిన జగన్‌పై రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందా? అంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.

Ys-Jaganmohan-Reddy

ఊహించని విధంగా వస్తున్న పలు సర్వేల్లో వైసీపీకి ఆదరణ తగ్గుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆత్మసాక్షి గ్రూప్ పేరుతో వచ్చిన సర్వేలో ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఎన్నికలు వస్తే, వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది. కానీ 2019 ఎన్నికల వచ్చిన ఫలితాలు రావని చెప్పింది. వైసీపీకి 50 పైనే సీట్లు తగ్గుతాయని సర్వేలో తేలింది. అలాగే టీడీపీ కూడా బాగానే పుంజుకుంటుందని తెలిసింది.

అటు నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో జగన్‌ చాలా వెనుకబడ్డారు. టాప్ టెన్‌లో కూడా జగన్ లేరు. అలాగే జగన్‌కు 81 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసింది. ఇటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఓ సర్వే బయటకు తీసుకొచ్చారు. ఆయన సర్వే ప్రకారం వైసీపీకి 50 సీట్లు కూడా రావని తేల్చి చెప్పారు.

ఈ విధంగా సర్వేల ద్వారా జగన్‌పై నెగిటివ్ బాగా ఉందా? అనే రేంజ్‌లో ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్తితులని బట్టి చూస్తే, మీడియాలో జరుగుతున్న ప్రచారం మాదిరిగా గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం జగన్‌పై వ్యతిరేకత లేదని తెలుస్తోంది. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. అయితే ఈ నెగిటివ్ ప్రచారం పోవాలంటే…పెండింగ్‌లో ఉన్న ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టిసి ఎన్నికల ఫలితాలు వస్తే వైసీపీకి కొత్త ఊపు వస్తుందనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version