బిగ్ బ్రేకింగ్ : ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

-

ఏపీలో కొత్తగా ఎన్నికల కమిషనర్ గా నియమితులు అయిన నీలం సాహ్నీ దూకుడు చూపిస్తున్నారు. సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించిన ఆమె కొద్ది సేపటి క్రితం పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ షెడ్యూల్ లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ నెల 8న పోలింగ్‌ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ రోజు ఇదే అంశంపై కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అయితే ఆమె బాధ్యతలు తీసుకున్న రోజే ఈ షెడ్యూల్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version