బెస్ట్‌ కెమెరా ఫోన్‌గా లాంచ్‌ అయిన ZTE Axon 40 Ultra.. హైలెట్‌ ఇదే..!

-

ZTE Axon 40 Ultra స్మార్ట్‌ ఫోన్‌ గ్లోబల్‌ లాంచ్‌ అయింది. చైనాలో గత నెలలో లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే.! ఇదొక లగ్జరీ స్మార్ట్‌ ఫోన్. ఈ ఫోన్‌ ఫీచర్స్‌, కాస్ట్‌, స్టోరేజ్‌ ఎలా ఉందో చూద్దామా..!

జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా ధర..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్ ధరను 799 డాలర్లుగా (సుమారు రూ.62,000) నిర్ణయించారు.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 899 డాలర్లుగా సుమారు రూ.70,000 ఉంది.
బ్లాక్ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

కెమెరా క్వాలిటీ..

ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు మూడు 64 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రధాన కెమెరా కాగా… ఇంకోటి.. వైడ్ యాంగిల్ లెన్స్, మరోటి.. పెరిస్కోపిక్ టెలిఫొటో లెన్స్. ముందువైపు అండర్ డిస్‌ప్లే కెమెరాను ఇవ్వడం ఇందులో హైలెట్‌.!

జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.8 అంగుళాల 2కే కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
డీటీఎస్ ఎక్స్ అల్ట్రా టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రాలో ఉన్నాయి.
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు.

ZTE Axon 30 Ultra నెక్ట్స్‌ వర్షన్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. చూడాలి ఈ ఫోన్..కష్టమర్స్‌ను యట్రాక్ట్‌ చేస్తుందో లేదో.! కాస్ట్‌ ఎక్కువగా ఉన్నా.. ఫీచర్స్ కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version