నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమ పద్ధతుల ఫోన్ల ట్యాపింగ్‌కు ఆస్కారం లేదని స్పష్టం చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తూ, వాహనాల తనిఖీలు నిర్వహిస్తోందని మహా కూటమి నేతలు చేసిన ఫిర్యాదుపై వివరణ కోరుతూ డీజీపీకి సీఈవో రజత్‌కుమార్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు అన్ని రాజకీయ పార్టీలూ సమానమేనని, ఎవరి పట్ల వివక్ష లేదన్నారు. ఫోన్ల ట్యాపింగ్ విషయంలో కేంద్ర హోంశాఖ నిబంధనలను అమలు చేస్తున్నామనితెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా విపక్ష పార్టీల నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదండరాం, ఎల్.రమణల వాహనాలను పోలీసులు తనిఖీ చేశారని వచ్చిన ఆరోపణలను డీజీపీ తోసిపుచ్చారు.