చాయ్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే టీ తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ మధ్య అందరూ ఏవేవో టీలకు అలవాటు పడుతున్నారు. గ్రీన్ టీ, మసాల టీ, జామాకు టీ, పుదీనా టీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది.. మీరు ఎప్పుడైనా కొంబుచా టీ (Kombucha tea) గురించి విన్నారా..? ఈ డ్రింక్‌ను మొదటగా ఏ దేశస్థులు తయారు చేశారో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తాగుతున్నారు. కొంబుచా డ్రింక్ అందించే అద్భుతమైన ప్రయోజనాలకు ఇండియన్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అందుకే, ఈ పులియబెట్టిన పానీయాన్ని తాగేందుకు తెగ ఎగడబుతున్నారు.
కొంబుచా అనేది ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, బ్లాక్ టీ, ఈస్ట్‌లతో తయారవుతుంది. ఈ రుచికరమైన ప్రోబయోటిక్ డ్రింక్‌ని తయారుచేసే ప్రక్రియను పులియబెట్టడం అని కూడా అంటారు. కొంబుచాను నెమ్మదిగా పులియబెట్టేటప్పుడు, ద్రవంలో ఉండే వివిధ ఎంజైమ్‌లు చక్కెర, టీని 7-10 రోజుల వ్యవధిలో కాస్త పుల్లగా, కార్బోనేటేడ్గా, రిఫ్రెష్ డ్రింక్‌గా మారుస్తాయి.
కొంబుచాలో అనేక యాసిడ్స్, విటమిన్లు, కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను చంపేస్తాయి. కొంబుచా ప్యాంక్రియాస్, కాలేయం, మూత్రపిండాలతో సహా వివిధ అవయవాలను రక్షించడంలో సహాయపడుతుందని తేలింది.
కొంబుచా ఒక రుచికరమైన డ్రింక్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన డ్రింక్ కూడా. చురుకైన జీవనశైలి సాగించేవారు.. ఈ డ్రింక్ రోజూ సేవిస్తే కొన్ని అదనపు కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది. కొంబుచా జీర్ణక్రియను చురుకుగా ఉంచుతూ అరుగుదల శక్తిని పెంచడంలో దోహదపడుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. ఈ డ్రింక్ రోజూ తీసుకుంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఈ సమస్య అందరికీ ఉంటుంది. ఈ పానీయంలోని వివిధ అమైనో ఆమ్లాలు కడుపు pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. తద్వారా, మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. లాక్టోబాసిల్లస్ వంటి డ్రింక్‌లో ఉండే వివిధ బ్యాక్టీరియా కడుపు ఇన్ఫెక్షన్లు, వాపులను నివారిస్తుంది. అంతేకాదు, క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు కొంబుచా టీలో ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది.