తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ తమ ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చకుంటున్నాయి.. మహాకూటమిగా ఏర్పడిన పార్టీలు తెరాసను టార్గెట్ చేస్తే.. తెరాస నేతలు వారికి అదే రీతిలో బదులిస్తున్నారు. తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని నగరంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణపై ప్రేమలేని పార్టీలు కూటమి కట్టాయని ఆ మహాకూటమి ఓ దుష్టచతుష్టయ కూటమి అని విమర్శించారు. గతంలో ఎన్నడు లేని విధంగా గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నేడు ప్రజల ముందుకు వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజల్ని పీక్కుతున్నాయని గుర్తుచేశారు. నైతిన విలువలను సైతం పక్కనకునెట్టి కాంగ్రెస్ – తెదేపా పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.