ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వీరికి కూతురు పుట్టగా తనకి క్లింకార గా నామకరణం చేశారు. అలాగే తన వల్ల మెగాస్టార్ ఫ్యామిలీ వారి పనులలో సక్సెస్ అవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ కి పెళ్లి అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి క్లీన్ కార తమ ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అంటూ అనౌన్స్ చేశాడు.
అయితే మెగా అభిమానులు క్లింకార ని చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు కానీ వారు ఆమెను ఎంతో గొప్పంగా ఉంచుతున్నారు.
తాజాగా క్లింకార కు ఆరు నెలలు పూర్తి కావడంతో రామ్ చరణ్ మరియు ఉపాసన ముంబైలోని మహాలక్ష్మి ఆలయంని సందర్శించారు. అక్కడ వారి కూతురి పేరుపై ప్రత్యేక అర్చనలు చేయించారు అలాగే వేద పండితులు కూడా పాప ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. క్లింకారాన్ని చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్న అభిమానులకు ఈసారి కూడా నిరాశ ఎదురయింది. వారు ఆమెను ఎంతో గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం వీరు ఈ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాల నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.