అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అవసరమైన మౌలిక వసతులను నాలుగు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం పూర్తి చేయడంతో… అక్టోబరు 25న తొలి అంతర్జాతీయ విమానం గన్నవరం నుంచి ఎగరనుంది. గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుతో ఈ సేవలు ప్రారంభమవనున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు కోరుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఏటా కనీసం 20 లక్షల మందికి పైగా విదేశాలకు వెళ్లేవారు ఉంటున్నారని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర విమానయాన శాఖకు నివేదికలు పంపింది. దీంతో నేరుగా సింగపూర్ కు విమానాలను నడుపుకునేందుకు మార్గం సుగమమం అయింది.
విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌కు చేరుకుంటే అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత సులువుగా చేరుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. గన్నవరం – సింగపూర్‌కు మంగళ, గురువారాల్లో విమాన సర్వీసును తొలుత అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి నేరుగా విదేశాలకు ప్రయాణించే సౌకర్యం కలగనున్నడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.