AP: ఆంటీతో అక్రమ సంబంధం…భర్త మందలించడంతో ప్రియుడి హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నిడమానూరులో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వివాహేతర సంబంధం.. ప్రాణాలు తీసింది. కృష్ణాజిల్లా నిడమానూరులో దంపతులు ప్రకాష్, కావ్య కాపురం ఉంటున్నారు. అయితే.. అక్కడే ఉన్న రెయిన్ బో ఆసుపత్రిలో ఆయాగా పని చేసిన సమయంలో వాసు అనే వ్యక్తితో కావ్యకు పరిచయం ఏర్పడింది.

కొంతకాలం ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు కలుస్తుండేవారు వాసు, కావ్య. అయితే… ఈ విషయం తెలిసి భార్య కావ్యను మందలించి, ఉద్యోగం మానిపించారు భర్త ప్రకాష్. దీంతో కావ్య ఇంటికి వచ్చి మెడక చున్ని బిగించి హత్య చేశాడు వాసు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పటమట పోలీసులు.