చిందు కళాకారుల భవనానికి భూమి పూజ

-

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిధిలోగల శ్యాంఘడ్ లో చిందు కళాకారుల కోసం సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో చిందు కళాకారుల పాత్ర ఎంతో విశిష్టమైంది.. ఎన్నో ఏళ్లుగా, తరతరాలుగా కళామతల్లికి సేవచేస్తూ కళనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి  వారి సంక్షేమం కోసం నేడు భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు చిందు కళాకారులకు అన్ని రంగాల్లో వారిని అదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమాజాన్ని  చైతన్య పరచడంలో కళాకారుల పాత్ర ఎంతో విలువైనది, వారి సంక్షేమం కోసం తెరాస అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనేక కార్యక్రమాలను రూపొందించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news