డిసెంబర్ 26 నుంచి జనవరి 6 వకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు,సీజీజీ డైరెక్టర్ జనరల్, సీఎస్ శాంతి కుమారితో పాటు వివిధశాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, నోడల్ అధికారులు సహా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నారు.
ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన prajapalana.telangaana.gov .in వెబ్సైట్ ను సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందగా ఇందులో 5 గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా.. ఇతర అభ్యర్థలనకు సంబంధించి 19 ,92 ,747 దరఖాస్తులు అందాయి.రాష్ట్రంలోని 710 మున్సిపల్ వార్డుల్లో,16,392 గ్రామ పంచాయితీలలో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించగా.. ఇందులో 1,11,46,293 మంది పాల్గొన్నారు. ప్రజా పాలన సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీలోని ఐదు జోన్లకు, 10 ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది.