బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది . బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీష్ కుమార్ తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.దేశంలో అత్యధికసార్లు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. 2000 ఏడాదిలో తొలిసారి సీఎం అయిన నితీశ్ 7 రోజులే పదవిలో ఉన్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు 9సార్లు ఓత్ స్వీకరించారు. ఆ తర్వాతి స్థానాల్లో వీరభద్రసింగ్(6సార్లు), జయలలిత(6సార్లు), జ్యోతిబసు (5సార్లు), గెగాంగ్ అపాంగ్ (5సార్లు), నవీన్ పట్నాయక్ (5సార్లు) ఉన్నారు.
2022 ఆగస్ట్‌లో ఏన్డీయే నుంచి బయటకి వచ్చిన ముఖ్యమంత్రి నితీష్ గతేడాది జనవరిలో రిపోర్టర్లు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. “అలాంటి ప్రశ్నే ఉండదు. బీజేపీతో కలవడం కంటే చనిపోవడమే మేలు“ అని చెప్పిన సంగతి తెలిసిందే.