మాల్దీవ్స్ పార్లమెంటులో అధికార పక్షం, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ ఇసా, పీఎన్సీ ఎంపీ అబ్దుల్లా షహీమ్ ఇరువురూ ఒకరిపై ఒకరు పరస్పరం దాడికి దిగారు. వారిద్దరినీ విడదీసేందుకు ఇతర ఎంపీలు తీవ్రంగా శ్రమించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కొత్త కేబినెట్ను ఆమోదించడంపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. ఓటింగ్ నిర్వహించే క్రమంలో ప్రతిపక్ష ఎంపీలు ఛాంబర్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా, అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో గొడవ జర్గింది.
సదరు, తీర్మానాన్ని వ్యతిరేకించిన కొందరు ఎంపీలు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి బూరతో పెద్దగా ఊదడం మొదలుపెట్టారు. ఆ ధ్వని తట్టుకోలేక స్పీకర్ చెవులు మూసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.