దేశంతో పోటీ పడుతున్న ఏపీ సర్కార్…!

-

కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరీక్షలను పెంచుతుంది రాష్ట్ర సర్కార్. తాజాగా వైద్య శాఖ చేసిన ప్రకటన ఆధారంగా చూస్తే… పది లక్షల మందికి సగటున ఆంధ్రప్రదేశ్‌లో 830 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 809 మందికి పరీక్షలు చేసి తర్వాతి స్థానంలో రాజస్థాన్‌ నిలిచింది. ఇప్పటి వరకు దేశంలో ఏ సర్కార్ కూడా ఈ స్థాయిలో పరిక్షలు చేయలేదు.

coronavirus

ఇప్పటి వరకు 41,512 మందికి టెస్టులు చేశామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. నిన్న ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో కరోనా పరిక్షలు నిర్వహించింది ఏపీ సర్కార్. 5,757 మందికి టెస్టులు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దక్షిణ కొరియా నుంచి కిట్స్ వచ్చిన తర్వాత పరిక్షల వేగం రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అన్ని జిల్లాలలోను కరోనా పరీక్షలను రాష్ట్ర సర్కార్ నివహిస్తుంది.

కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే పరిక్షలు చేస్తుంది సర్కార్. రోజు రోజుకి కేసుల తీవ్రత పెరగడంతో కరోనా టెస్టు లను పెంచడమే మంచిది అనే భావనలో ఉంది. చాలా రాష్ట్రాల్లో కనీసం పది లక్షల మందిలో 100 మందికి కూడా కరోనా టెస్ట్ లు నిర్వహించలేదు. ఒకరకంగా చెప్పాలి అంటే దేశం తో రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతుంది. అయితే కరోనా కేసుల విషయంలో నిజాలు దాస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news