సంచలనం; గుండెల్లో పెట్టుకున్న మావోయిస్ట్ లను కొట్టి చంపేసిన గ్రామస్తులు…!

-

ఓడిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల్లో మావోయిస్ట్ లను గ్రామస్తులు గుండెల్లో పెట్టుకుంటూ ఉంటారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం వచ్చినా సరే తోడు ఉంటారు. పోలీసు బలగాల నుంచి రక్షణ కల్పిస్తూ ఆర్ధికంగా కూడా అండగా నిలబడతారు. అలాంటి మావోయిస్ట్ ల మీద గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి కొట్టి చంపేసిన ఘటన ఓడిస్సాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని శనివారం రాత్రి సమయంలో చిత్ర‌కొండ బ్లాక్ ప‌రిధిలోని జొడొంబో పంచాయ‌తీ జంతురాయ్ గ్రామానికి ముగ్గురు మావోయిస్ట్ లు వచ్చారు. వచ్చి రావడంతోనే గ్రామానికి చెందిన ఒక గిరిజన యువకుదుని తమతో తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేసారు. అయితే దీనిని గ్రామస్తులు వ్యతిరేకించారు. వద్దని అందరూ వారించారు. దీనితో మావోయిస్ట్ లు గ్రామస్తుల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు.

గ్రామస్తులు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితో మావోల మీద రాళ్ళ దాడి చేసారు గ్రామస్తులు. ఈ దాడిలో ఒక మావోయిస్ట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒక మావోయిస్ట్ పారిపోయాడు. మరో మావోయిస్ట్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మావో ని జిల్లా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనతో ఒక్కసారిగా మావోయిస్ట్ లు కూడా ఉలిక్కిపడ్డారు. గత కొంత కాలంగా గిరిజనులకు మావోలు దూరమవుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version