జనవరి 10 గురువారం- రోజువారి రాశిఫలాలు

-

గురుపూజ ఈ రాశి వారికి లాభం చేస్తుంది..!

మేషరాశి: అధికారుల వలన లాభం, చిన్నచిన్న సమస్యలు, అకాల భోజనం, స్వల్ప ఆనారోగ్య సమస్యలు. మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన చేయండి.

వృషభరాశి: మిత్రుల సహకారం, ప్రతి పనిలో ఆటంకం, దేవాలయ సందర్శన సూచన, విందువినోదాలకు అవకాశం. పరిహారం ఇష్టదేవతారాధన చేయండి.

మిధునరాశి: వ్యాపారాభివృద్ధి, చేపట్టిన పనుల్లో ఆటంకం, ధననష్టం, ఆరోగ్యంలో మార్పులు. పరిహారం గురుధాన్యం, పూజ లేదా గురు సంబంధమైన దేవాలయ సందర్శన చేసుకోండి.

కర్కాటకరాశి: సౌఖ్యం, స్త్రీమూలక లాభం, శారీరక శ్రమ, చేసే పనుల్లో ఇతరుల జోక్యాన్ని నిరోధించండి లేకుంటే నష్టపోయే సూచన. గురువార నియమం పాటించండి మంచి ఫలితం ఉంటుంది.

సింహరాశి: ధనలాభం, ఆకస్మిక లాభాలు, భార్యవల్ల లాభం, తండ్రి సంబంధీకులకు ఇబ్బందులు. పరిహారం కోసం విష్ణు సంబంధ పూజ లేదా పారాయణం చేయండి.

కన్యారాశి: అధిక ధనలాభ సూచన, మనస్సులో ఆందోళన, కొన్నిరోజులుగా వాయిదా పడుతున్న పనులు పూర్తయ్యే అవకాశం, స్త్రీమూలక ధనం. మంచి ఫలితాల కోసం లక్ష్మీ ఆరాధన లేదా ఆరావళి కుంకుమ పెట్టుకోండి.

తులారాశి: నూతన పరిచయాలు, బంధుమిత్రులతో వాదాలకు అవకాశం, చిన్న సమస్యలు వచ్చిన అధిగమిస్తారు. గోసేవ లేదా పేదలకు భోజనం పెట్టండి మంచి ఫలితం వస్తుంది.

వృశ్చికరాశి: ఆందోళన, సమస్యలు, ప్రతికూల వాతావరణం. వీటన్నింటిని అధిగమించడానికి నవగ్రహ ప్రదక్షిణ లేదా హనుమాన్ చాలీసా పఠనం చేయండి.

ధనస్సురాశి: ధనలాభం, సేవింగ్స్ చేసే అవకాశం, పనులు పూర్తి, సానుకూల సమయం. మరింత మంచి ఫలితం కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.

మకరరాశి: ప్రతికూలమైన రోజు, రాజకీయనాయకుల కలయిక, స్త్రీ మూలకంగా నష్టం, పనుల్లో ఆటంకాలు. శనిగ్రహ ఆరాధన లేదా వేంకటేశ్వరస్వామి ధ్యానం చేసుకోండి.

కుంభరాశి: బంధువులతో సఖ్యత, ప్రయాణ అవకాశాలు, ధనవ్యయం, చిన్నచిన్న ఇబ్బందులు వస్తాయి అయినా అధిగమిస్తారు. మంచి ఫలితం కోసం దేవాలయ సందర్శన/ ఆరాధన చేయండి.

మీనరాశి: ప్రతికూలమైన రోజు, దేవాలయ సందర్శన, కొత్త పనులు ప్రారంభించకండి, కార్యాలలో ఆటంకాలు. పరిహారం గురుధ్యానం, గోసేవ చేయండి లేదా బీదలకు భోజనం పెట్టించండి మంచి ఫలితం లభిస్తుంది.

నోట్: గురువార నియమం అంటే గురువారం సూర్యోదయానికి పూర్వమే తల స్నానం చేయడం, దేవుని ప్రార్థన/ధ్యానం చేసుకోవడం, వీలైతే దేవాలయ సందర్శన, ఒక్కపూట భోజనం, ఆప్తులకు, అపన్నులకు చేతనైన సహాయం చేయడం. మాంసాహారం, మద్యం, విందులకు దూరంగా ఉండటం. వీలైతే రాత్రిపూట కింద చాపవేసుకొని పడుకోని ఉండటం. గురుధాన్యం చేసుకోవడం.
-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version