పసుపు రంగు దుస్తుల ధారణ ఈరాశికి మంచిది! జూన్ 16 రాశి ఫలాలు

-

ఆదివారం- జూన్ 16 రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యం బాగుండదు, కుటుంబ సంతోషం, వివాహితులకు ఆనందకరమైన రోజు, చేసేపనిలో ఆటంకాలు, ఇబ్బందులు.
పరిహారాలు: పసుపు రంగు దుస్తుల ధారణ, అమ్మవారికి పసుపు సమర్పణ చేస్తే మంచి ఫలితాలు.

వృషభరాశి: ప్రేమ సంబంధ విషయాలు అనుకూలం, వివాహితులకు అద్భుతమైన ఘడియలు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి, పని ఒత్తిడి, వినోదం, ఖర్చులు, ఆరోగ్య సమస్యలు. ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి.
పరిహారాలు: ఎరుపు రంగు దుస్తుల ధారణ మంచి ఫలితాన్నిస్తుంది.

మిథునరాశి: సంతోషకరమైన రోజు, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ సంతోషం, సఖ్యత, భాగస్వామితో ఆనందం, పనిలో ఇబ్బందులు, ప్రేమవిషయాలు అనుకూలం.
పరిహారాలు: ఒత్తిడి తగ్గడం కోసం గంధాన్ని ధారణ చేయండి.

కర్కాటకరాశి: ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సంతోషం, ఆర్థికంగా బాగుంటుంది, ప్రే, వృత్తి, భాగస్వామి విషయాలలో అనుకూలం. ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన సరిపోతుంది.

సింహరాశి: ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు, కుటుంబ విషయంలో ఓర్పు అవసరం, వృత్తిలో సాధారణంగా ఉంటుంది, సామాజిక, మతపరైమన వేడుకలు.
పరిహారాలు: తెల్లని దుస్తుల ధారణ మంచి చేస్తుంది.

కన్యారాశి: కుటుంబంలో ఆనందోత్సవాలు, ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్యం బాగుంటుంది, వివాహితులకు ఆనందమైన రోజు, వృత్తిలో అనుకూలత, ప్రేమ విషయాలు అనుకూలం.
పరిహారాలు: ఆదివార నియమాన్ని పాటించండి ఆర్థిక, ఆరోగ్య లాభాలను పొందండి.

తులారాశి: టెన్షన్ కోపాన్ని తెస్తుంది, ఉద్రేకపూరిత వాతావరణానికి దూరంగా ఉండాల్సిన రోజు, కుటుంబంలో ఇబ్బందులు, చేసే పనిలో ఆటంకాలు, సంపద విషయంలో పర్వాలేదు, ముఖ్యమైన వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి.
పరిహారాలు: సూర్యనమస్కారాలు, గోధుమలను నవగ్రహాల దగ్గర పెట్టండి.

వృశ్చికరాశి: ఔట్‌డోర్ క్రీడలు మిమ్నుల్ని ఆకర్షిస్తాయి, ధ్యానం,యోగా మంచిచేస్తాయి, పాతమిత్రుల కలయిక లేదా సంభాషణ. ఇతరుల సలహాలను పొంది లాభ పడుతారు,
పరిహారాలు: ఇష్టదేవతరాధన సరిపోతుంది.

ధనస్సురాశి: వృత్తిలో నైపుణ్యానికి పరీక్ష, ఏకాగ్రతతో పనిచేయండి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అధిక లాభాన్నిస్తుంది, ఇంటిపనుల్లో పిల్లల సహాయం, భాగస్వామి అరోగ్యం జాగ్రత్త, పెండింగ్ పనులు పూర్తి,
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

మకరరాశి: ఆరోగ్య విషయాలు జాగ్రత్త, ఆర్థికంగా పర్వాలేదు. కుటుంబంలో ఇబ్బందులు, అనవసర వివాదాలకు పోకండి, పనిలో అనుకూలత, భాగస్వామితో సాధారణం, శ్రద్ధ, ఓర్పు ఈ రోజు అవసరం.
పరిహారాలు: ఇంట్లో దీపారాధన, ఆదివార నియమం చేస్తే మంచిది.

కుంభరాశి: సరదా, ఆనందం, ఆర్థికంగా ఇబ్బంది, కుటుంబంలో సమస్యలు, ఆరోగ్యం బాగుంటుంది, ఖర్చులను పరిమితం చేసుకోండి, వినయంగా ఉండటం మంచిది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దీపారాధన చేయండి సరిపోతుంది.

మీనరాశి: అదృష్టం పైన ఆధారపడకండి, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ సఖ్యత, పనిలో ఆనందం, ప్రేమ విషయాలు అనుకూలం, ఆరోగ్య ఇబ్బందులు,
పరిహారాలు: ఎర్రని దుస్తులు లేదా కర్చీఫ్ వాడండి మంచి జరుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news