ఈ 3 రాశుల వారికి తాబేలు ఉంగరం కలిసి రాదు.. ఎందుకో తెలుసా?

-

చాలా మందికి జాతకాలు, రంగు రాళ్లు, ఉంగరాల మీద బీభత్సమైన నమ్మకం ఉంటుంది. రాశికి తగ్గట్టుగా రాళ్ల ఉంగరాలు పెట్టుకుంటే అదృష్టం అతుక్కునే ఉంటుంది అని నమ్ముతారు. ఇందులో నిజం ఎంత
ఉందో తెలియదు కానీ.. ఇలాంటి చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం పాజిటివ్‌ ఎనర్జీ.. మన చుట్టు ఎంత ఎక్కువ పాజిటివ్‌ ఎనర్జీ ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. చేసే పని కూడా హాయిగా ఉంటుంది. చాలా మందిని మీరు గమనిస్తే తాబేలు ఉంగరాలు పెట్టుకుంటారు. ఈ ఉంగరం లక్ష్మీదేవికి సంబంధించినది. కాబట్టి, ధరించే ముందు కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మేష రాశి :

మేష రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడూ తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. దానిని అతిక్రమిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కన్య :

కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి, ఈ రాశి వారు ఎప్పుడూ తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. ఉల్లంఘించినట్లయితే, మీరు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. అంతే కాకుండా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

మీనం :

ఈ రాశికి బృహస్పతి అధిపతి కాబట్టి, ఈ రాశి వారు ఎప్పుడూ తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు. అతిక్రమిస్తే జాతకంలో గురుగ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈ కారణంగా, మీ అదృష్టం అనుకూలంగా ఉండదు మరియు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు జాగ్రత్త!

తాబేలు ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు

తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదని, శాంతి చేకూరుతుందని నమ్ముతారు. తాబేలు విష్ణుమూర్తికి సంబంధం ఉంది కాబట్టి శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీమీద ఉంటాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఈ ఉంగరం ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది.
ఇంట్లో సానుకూల వాతావరణం ఉండి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. అయితే ఈ ఉంగరం ఎవరంటే వాళ్ళు ధరించడం మంచిది కాదు. జ్యోతిష్యుని సలహా తీసుకున్న తర్వాత జాతకం ప్రకారం ఈ ఉంగరం ధరించడం మంచిది. మేషం, వృశ్చికం, కర్కాటకం, మీనం రాశుల వాళ్ళు ఈ తాబేలు ఉంగరం ధరించకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news