మేషరాశి: మిశ్రమ ఫలితాలు, పనుల్లో జాప్యం, అధికారుల సహకారం, కార్యనష్టం, విందులు. పరిహారాలు చాలీసా పారాయణం లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించండి/వినండి మంచి ఫలితం వస్తుంది.
వృషభరాశి: అనుకూలమైన ఫలితాలు, విందులు, వినోదాలు, ఉత్సాహం, దేవాలయ దర్శనం. అనుకూలమైన రోజు కాబట్టి ఏదైనా ఒక మంచి పనిచేయండి. తప్పక విశేషం జరుగుతుంది.
మిధునరాశి: ప్రతికూల ఫలితాలు, పనుల్లో జాప్యం, కుటుంబంలో కలహాలు. పరిహారాలు సూర్యనమస్కారం, తెల్ల జిల్లేడుతో శివారాధన లేదా విష్ణు సహస్రనామ పఠనం/శ్రవణం
కర్కాటకరాశి: అనుకూల ఫలితాలు, వస్తుప్రాప్తి, బంధువులతో సఖ్యత,కుటుంబంలో సంతోషం, జయం. ఈరోజు గోసేవ/అన్నదానం వంటి మంచి పనులు చేయండి.
సింహరాశి: ప్రతికూలమైన రోజు, వివాదాలకు దూరంగా ఉండండి. ధననష్టం, అనారోగ్యం.పరిహారాలు సూర్యారాధన, మాఘమాసం కాబట్టి ఆదివారం ఈరోజు సూర్యునికి అర్ఘ్యం వదలండి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
కన్యారాశి: ప్రతికూలం. వ్యాపారనష్టం, బంధువుల నుంచి చెడువార్తా శ్రవణం, పనులు సాగవు. పరిహారాలు అమ్మవారిని ధ్యానించండి. చాలీసా లేదా ఇష్టదేవతరాధన చేసుకోండి. \
తులారాశి: అనుకూలమైన రోజు, వస్తులాభం, అందిరితో సఖ్యత, పనులు సజావుగా సాగిపోతాయి. పరిహారాలు సూర్యనమస్కారాలు, సూర్యునికి అర్ఘ్యం.
వృశ్చికరాశి: ప్రతికూల ఫలితం, స్త్రీలతో కలహాలు, బంధువుల రాక, కార్యనష్టం. పరిహారాలు దేవీ స్తోత్రపఠనం, చండీదీపారాధన చేయండి.
ధనస్సురాశి: మంచి ఫలితాలు, ఆరోగ్యం, విందులు, బంధువులతో సఖ్యత. ఇష్టదేవతారాధన చేసుకోండి.
మకరరాశి: అనుకూల ఫలితాలు, ఆదాయం అధికం, సంతోషం, నూతన కార్యజయం. పరిహారాలు గోసేవ లేదా పేదలకు అన్నదానం చేయండి.
కుంభరాశి: ప్రతికూల ఫలితాలు, పనుల్లో జాప్యం, అనారోగ్య సమస్యలు. పరిహారాలు చాలీసా పారాయణం, సూర్యనమస్కారం తప్పక చేయండి.
మీనరాశి: ప్రతికూలం. దుఃఖం, కుటుంబంలో ప్రతికూలత, ధననష్టం, పరిహారాలు శివునికి అర్క పుష్పం (తెల్ల జిల్లేడు)తో పూజ చేయండి తప్పక మంచి ఫలితం వస్తుంది.