తెల్ల జిల్లేడుతో శివపూజ చేయండి విశేష ఫలితం !
మేషరాశి: ధనలాభం, పాత బాకీలు వసూలు, భక్తి పెరుగుతుంది. పనులు జరుగుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.
వృషభరాశి: వస్తు లాభం, విందులు, వినోదాలు, బంధువుల రాక. లక్ష్మీ, సూర్య ఆరాధన చేయండి.
మిధునరాశి:కొత్త పనులు ప్రారంభం, కళత్ర బంధువర్గ రాక, దేవాలయ దర్శన సూచన. ఇష్టదేవతరాధన, పక్షులకు ఆహారం పెట్టడం మంచి చేస్తుంది.
కర్కాటకరాశి: ప్రతికూల వాతావరణం, అపజయాలు, దుఃఖం. తెల్ల జిల్లేడుతో ఈశ్వరా ఆరాధన చేయండి మంచి ఫలితాల వస్తాయి.
సింహరాశి: కార్యజయం, శాంతి, ఆకస్మిక ధనలాభం. పనులు సాఫీగా సాగడానికి విష్ణు సహస్రనామం పారాయణం/శ్రవణం చేయండి.
కన్యారాశి: ప్రతికూల వాతావరణం. దైవదర్శన సూచన, అన్నింటా ఇబ్బందులు. శనిస్తోత్ర పారాయణం. సూర్యనమస్కారాలు మంచి చేస్తాయి.
తులారాశి: అధిక ఉత్సాహం, ఆకస్మిక ధనలాభం, పెద్దవారితో పరిచయాలు. ఇష్టదేవతరాధన, సూర్యనమస్కారాలు చేయండి.
వృశ్చికరాశి: మిశ్రమ ఫలితం, దైవదర్శనం, అందరితో మాటలు పడే సూచన. తెల్లని పూలతో దేవతరాధన చేయండి. సాయంత్రం చంద్రుని చూస్తూ ఇష్టదేవతరాధన చేయండి. మంచి ఫలితం వస్తుంది.
ధనస్సురాశి: అకస్మిక ధనలాభం, అశాంతి, పనులు నిదానంగా సాగుతాయి. పనులు వేగంగా సాగడానికి నవగ్రహ స్తోత్ర పఠనం/ శ్రవణం చేయండి.
మకరరాశి: శుభకార్యాలు, నూతన మిత్రుల కలయిక, పనులు పూర్తి అవుతాయి. శని శాంతి కోసం స్తోత్రాలు పఠనం, గోసేవ, గోవింద నామాలు చదువుకోండి విశేషంగా పనిచేస్తాయి.
కుంభరాశి: బంధువుల రాక, చిన్నచిన్న వివాదాలు, దేవాలయ దర్శన సూచన. మంచి ఫలితాల కోసం తెల్ల జిల్లేడుతో ఈశ్వరుడికి పూజ చేయండి లేదా మారేడుదళాలతో విష్ణు పూజ మంచిచేస్తుంది.
మీనరాశి: మిశ్రమంగా ఉంటుంది. బాకీలు వసూలు కావు, అనవసర ఖర్చులు. పనులు నిదానంగా సాగుతాయి. ఇష్టదేవతారాధన, గణపతి దేవాలయ సందర్శన లేదా ఓం గం గణపతయేనమః అనే నామాన్ని స్నానం చేసిన తర్వాత భక్తితో కనీసం 108 సార్లు పఠించండి మంచి ఫలితం వస్తుంది.
-కేశవ