వాయిస్ ఆఫ్ యాత్ర.. మమ్ముట్టి తెలుగు డబ్బింగ్ వీడియో

-

దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ఆయన పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న సినిమా యాత్ర. సినిమాలో వైఎస్సార్ గా మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి ఈ సినిమా నిర్మిస్తుండగా మహి వి రాఘవ్ డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే ఇంప్రెస్ చేశాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాయిస్ ఆఫ్ యాత్ర అంటూ సినిమా కోసం మమ్ముట్టి చెబుతున్న డబ్బింగ్ వీడియో రిలీజ్ చేశారు. సినిమాకు మమ్ముట్టి పెట్టిన ఎఫర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. యాత్ర సినిమాలో వై.ఎస్.ఆర్ గా మమ్ముట్టి ది బెస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ కథానాయకుడు నిరాశపరచగా వై.ఎస్ బయోపిక్ గా వస్తున్న ఈ యాత్ర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version