హనుమాన్ దేవాలయంలో ఐదు వత్తుల దీపం పెడితే ఈరాశి వారికి దోషాలు పోతాయి! మార్చి 26 రాశిఫలాలు

-

నోట్: నువ్వుల నూనెతో దీపారాధన చేసి దానిలో లవంగం వేసి దేవునికి హారతి ఇవ్వండం అనేది చాలా అద్భుత తంత్రం. దీనివల్ల చాలామంది లబ్ది పొంది ఉన్నారు. ఉత్తర భారతంలో ఈ తంత్రం చాలా ప్రసిద్ధి. నమ్మకంతో ఆచరించండి తప్పక శుభం జరుగుతుంది. జై హనుమాన్.

26 march 2019 Tuesday horoscope

మేషరాశి : మిశ్రమం, ఉద్యోగులకు ఆదాయం, కలహం, చికాకు, అందోళన, పనులు జాప్యమైనా పూర్తవుతాయి.
పరిహారాలు: ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన చేసుకోండి మంచి జరుగుతుంది.

వృషభరాశి : అనుకూలమైన ఫలితాలు, కుటుంబంలో సఖ్యత, కార్యలాభం, శ్రమ అధికం, పనులు పూర్తి, విందులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

మిథునరాశి : మంచి, చెడు, ధనలాభం, పనులు పూర్తికావు, చికాకులు, విందులు.
పరిహారాలు: హనుమాన్ దేవాయలంలో ఐదువత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి : అనుకూలమైన ఫలితాలు, స్త్రీ పరిచయం, వ్యవహార లాభం, ధనలాభం.
పరిహారాలు: నవగ్రహాల ప్రదక్షణ, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి మేలు జరుగుతుంది.

సింహరాశి : వ్యతిరేక ఫలితాలు, విరోధాలు, ధననష్టం, కార్యభంగం, వివాదాలు.
పరిహారాలు: హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ, వడమాల పూజ లేదా సింధూరం వేయించండి మంచి ఫలితాలు వస్తాయి.

కన్యారాశి : సామాన్యమైన ఫలితాలు, కుటుంబంలో సఖ్యత, ప్రయాణ సూచన, సోదర, సోదరీలు ఇంటికి రాక, బంధుమిత్రుల మైత్రి.
పరిహారాలు: నవగ్రహాలకు పూజ, ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి.

తులారాశి : ఇబ్బందులు, విరోధాలు, కలహాలు, దుబారా ఖర్చు.
పరిహారాలు: వివాదాలకు దూరంగా ఉండాలి. మౌనం మంచిది. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ చేయించుకోండి లేదా ఐదు వత్తులతో దీపారాధన చేయండి మేలు జరుగుతుంది.

వృశ్చికరాశి : అనుకూలమైన రోజు, జయం, ధనలాభం, ప్రయాణ సూచన, అరోగ్యం, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు, ఆకుపూజ చేసుకోండి.

ధనస్సురాశి : అనుకూల ఫలితాలు, విందులు, కుటుంబంలో సంతోషం,పనులు పూర్తి, ముఖ్యవిషయాలను చర్చిస్తారు.
పరిహారాలు: హనుమాన్ దేవాయలంలో పూజ, ప్రదక్షణలు మేలు చేస్తాయి.

మకరరాశి : అనుకూలమైన రోజు, వస్తులాభం, పట్టుదలతో పనిచేస్తారు, కార్యజయం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

కుంభరాశి : మిశ్రమ ఫలితాలు, కార్యజయం, ఆరోగ్యం, అలసట, శ్రమ అధికం, విరోధాలు.
పరిహారాలు:హనుమాన్ దేవాలయంలో సింధూర పూజ లేదా వడమాల పూజ చేయించుకోండి.

మీనరాశి : అన్నింటా వ్యతిరేకం, మనస్పర్థలు, విబేధాలు, వస్తునష్టం.
పరిహారాలు: హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ లేదా సింధూర ధారణ చేయించండి మంచిది.

 

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version