ఫ్యామిలీలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటారా? వైఎస్ షర్మిల

-

ఆయన్ను ఎంత కిరాతకంగా చంపారంటే… చేసిన వాళ్లు మనుషులా లేక క్రూర మృగాల అనిపిస్తుంది. పైగా మేమే హత్య చేశామంటున్నారు. మేము బాధితులం. మాపై నిందలు మోపితే అప్పుడు బాధితులు డిఫెన్స్ లో పడతారు.

వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఇవాళ మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆమె పెదవి విప్పారు.

ఫ్యామిలీలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటారా? మా ఫ్యామిలీలో అయితే గొడవలే లేవు. ఒకవేళ మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే మీరు హత్యలు చేసుకుంటారా? మా పెద్దనాన్న జార్జి రెడ్డి లేరు. రెండో స్థానంలో మా నాన్న రాజశేఖర్ రెడ్డి లేరు. మూడో స్థానంలో మా బాబాయి వివేకానంద రెడ్డి మా ఇంటి పెద్దగా ఉన్నారు.

ఆయన్ను ఎంత కిరాతకంగా చంపారంటే… చేసిన వాళ్లు మనుషులా లేక క్రూర మృగాల అనిపిస్తుంది. పైగా మేమే హత్య చేశామంటున్నారు. మేము బాధితులం. మాపై నిందలు మోపితే అప్పుడు బాధితులు డిఫెన్స్ లో పడతారు. మేము డిఫెన్స్ లో పడాలి. నిజమైన దోషులు బయట తిరగాలి. అది వాళ్ల స్ట్రాటజీ.


రాజశేఖర్ రెడ్డి తండ్రిని కూడా ఇలాగే అతి కిరాతకంగా చంపారు..

రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిని కూడా ఇలాగే అతి దారుణంగా చంపారు. అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి. టీడీపీ వాళ్లే చంపారు. వాళ్లకు చంద్రబాబు అండగా నిలబడ్డారు. ఇప్పుడు అలాగే జరిగింది. మా ఇంటి పెద్ద వివేకానంద రెడ్డిని చంపారు. వీళ్లకు కూడా చంద్రబాబు అండగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి. వాళ్లను కాపాడుతూ మేమే క్రిమినల్స్ అని అంటున్నారు. నిజానికి చంద్రబాబుకు ఏ పాపం తెలియకపోతే.. ఆది నారాయణరెడ్డికి గానీ.. టీడీపీకి గానీ… ఏ పాపం తెలియకపోతే థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదు. దమ్ముంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీని చంద్రబాబు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version