ఫిబ్రవరి 26 మంగళవారం- రోజు వారి రాశి ఫలాలు

-

తెల్లపూలతో గణపతిని ఆరాధించండి.. విద్యార్థులకు పరీక్షల్లో జయం!


మేషరాశి: ప్రతికూల ఫలితాలు, వాహనంతో జాగ్రత్త, పనుల్లో ఆటంకం, విరోధాలు. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణలు చేయండి తప్పక మంచి జరుగుతుంది.

వృష‌భ రాశి: అనుకూలమైన రోజు, పనులో సాగిపోతాయి, ఉత్సాహంగా ఉంటారు, శుభవార్తా శ్రవణం. పరిహారాలు ఇష్టదేవతారాధన, అమ్మవారి కుంకుమ ధరించండి.

మిథునరాశి: అనుకూలమైనరోజు, పనుల్లో వేగం, విందులు, ప్రయాణ సూచన, ఆనందం. పరిహారాలు ఈశ్వర ఆరాధన లేదా శివాభిషేకం చేసుకోండి. లేదా భస్మధారణ చేయండి.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, కార్యజయం, ప్రయాణ సూచన, ఖర్చులు పెరుగుతాయి. పరిహారాలు ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణ/చాలీసా పఠనం లేదా శ్రవణం చేయండి.

సింహరాశి: మిశ్రమం. కార్యలాభం, విందులు, సోదరుల సహకారం, అనారోగ్యం, వివాదాలు. పరిహారాలు చాలీసా పారాయణం/సింధూర ధారణ చేయండి.

కన్యారాశి: అనుకూల ఫలితాలు, అధికశ్రమ, జయం, ధనలాభం. పరిహారాలు ఇష్టదేవతరాధన లేదా ఎవరికైన అవసరమైన వారికి మీ శక్తిమేరకు సహాయం చేయండి.

తులారాశి: ప్రతికూలం. పనుల్లో జాప్యం, వివాదాలు, వాహన నష్టం, విందులు. పరిహారాలు చాలీసా పారాయణం, మౌనంగా ఉండటం , వివాదాలకు దూరంగా ఓపికగ్గా ఉండండి.

వృశ్చిక‌రాశి: మిశ్రమ ఫలితం, లాభం, బంధువుల కలయిక, వ్యాపార నష్టం. పనుల్లో జాప్యం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా స్తోత్ర పారాయణం చేయండి.

ధనస్సురాశి: మిశ్రమ ఫలితాలు, కార్యలాభం, కలహాలు, విందులు, అనారోగ్య సూచన. పరిహారాలు భగవన్నామస్మరణ వీలైతే హనుమాన్ గుడికి వెళ్లి చాలీసా చదవండి.

మకరరాశి: అనుకూలం. స్త్రీల వల్ల కార్యలాభం, అధిక వ్యయం, పనుల్లో వేగం. పరిహారాలు చాలీసా పారాయణం లేదా దేవాలయ ప్రదక్షణలు.

కుంభరాశి: అనుకూలం. కార్యలాభం, సోదర వర్గంతో లాభం, గౌరవం. పరిహారాలు ఆంజనేయ దండకం చదువుకోండి లేదా నవగ్రహ స్తోత్రం చదవండి.

మీనరాశి: మిశ్రమం. కార్యజయం, ఆందోళన, అనవసర కలహాలు, నష్టం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ, గోసేవ చేయండి మంచి జరుగుతుంది.

నోట్ -1: ఇది పరీక్షల సమయం. విద్యార్థులు ఏ రాశి వారైనా ఎలాంటి జాతకులైన పర్వాలేదు. అన్నింటికి మూలం వినాయకుడు. కాబట్టి గణపతిని తెల్లపూలతో అర్చించి పరీక్షలకు సిద్ధం కండి తప్పక విజయం లభిస్తుంది. అందరూ విద్యార్థులు ఇంట్లో వినాయకుడి ఫొటో/విగ్రహం దేనికైనా విశ్వాసంతో నమస్కరించి రెండు పూలు సమర్పించండి. మీకు పరీక్షల్లో ఆటంకాలు పోయి అన్ని స్మరణకు వచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మీ పిల్లలు హాస్టల్‌లో ఉంటే మీరు వారి పేరుచెప్పి పైన చెప్పినట్లు చేయండి విజయం చేకూరుతుంది. ఓం నమో గణపతయేనమః

నోట్-2: పరిహారాలు చాలా సులవైనవి, నిత్య జీవితంలో మీమీ ఉద్యోగాలకు ఆటంకం కలగకుండా ఆచరించదగ్గవే సూచిస్తున్నాం. అయితే గోచారంలో మీకు ఫలితాలు తప్పక వస్తాయి. కానీ జన్మనక్షత్ర పరంగా జాతకరీత్యా మీకు ఇబ్బందులు ఉంటే వీటి వల్ల కేవలం ఉపశమన మాత్రమే కలుగుతుంది. మీమీ జాతకాలను జ్యోతిష పండితులకు చూపించుకుని తగ్గ పరిహారాలు పాటించాలి. అయితే ఏదీ తెలియనివారు భగవంతుని మీద భారం వేసి మేము సూచిస్తున్న పరిహారాలను పాటిస్తూ విశ్వాసంతో, నిజాయితితో పనులు/ఉద్యోగ విధులు నిర్వహించండి తప్పక మంచి జరుగుతుంది. పదిమంది మంచి కోరుకోండి మీకు తప్పక మంచి జరుగుతుంది. ఓం నమో వేంకటేశాయనమః
– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version