టీడీపీ పార్టీకి తన పార్టీ నేతల నుంచే అనుకోని షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ముఖ్యులు పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఇంకొంతమంది వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నేతలతో కూడా చంద్రబాబుకు తలనొప్పి స్టార్ట్ అయింది. టీడీపీ తరుపున ఎంపీలుగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే చంద్రబాబు తలనొప్పికి కారణం. చాలామంది నేతలు ఎంపీగా అయితే మేం పోటీ చేయం అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు చంద్రబాబు.
తాజాగా అనంతపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెడదామనుకున్న జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా తాను ఎంపీగా పోటీ చేయనని తెగేసి చెప్పేశాడు. ఆయన ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా లేడట. దీంతో ఇన్ని రోజులు అనంతపురం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డిని బరిలో దింపుదామనుకున్న బాబు ఆసలు అడియాశలయ్యాయి. ఇలా.. రాష్ట్రంలోని ఒక్క నియోజకవర్గమే కాదు.. ఒంగోలు ఎంపీ సీటులోనూ ఇదే రచ్చ. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఈసారి ఒంగోలు ఎంపీగా నిలబడేందుకు ససేమిరా అంటున్నాడు. అంతే కాదు.. ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇస్తే ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.