పేదలకు అన్నదానం చేస్తే శివానుగ్రహం ఈరాశివారికి!
మేషరాశి: శివారాధన, ఉపవాసం మీకు, మీ కుటుంబానికి మేలు చేస్తుంది.
పరిహారాలు: పేదవారికి అన్నదానం, శివాలయ ప్రదక్షణలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
వృషభరాశి: అనుకూలం, ఆదాయంలో పెరుగుదల, పనులో పూర్తి, ధనలాభం. అలసట.
పరిహారాలు: గోసేవ, పేదలకు అన్నదానం, ధర్మం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మిథునరాశి: ప్రతికూలమైన రోజు, అపజయం, ఇబ్బందులు, రుణబాధలు, అలసట, అధికశ్రమ.
పరిహారాలు: శివార్చన, పేదలకు అన్నదానం, గోసేవ లేదా రావిచెట్టుకు ప్రదక్షణలు చేయండి కొంత ఉపశమనం లభిస్తుంది.
కర్కాటకరాశి: ప్రతికూల వాతావరణం. అధిక ఖర్చులు, వఋథా కాలయాపన, అలసట.
పరిహారాలు: శివార్చన, దేవాలయ దర్శనం, దేవనామస్మరణ మేలు చేస్తుంది.
సింహరాశి: అనుకూలం. ధనలాభం, విందులు, కార్యజయం, అలసట.
పరిహారాలు: శివునికి ఆవుపాలతో అభిషేకం చేయండి. అవకాశం ఉంటే పేదలకు సహాయం చేయండి.
కన్యారాశి: అనుకూలం. కీర్తివఋద్ధి, వ్యాపారంలో చిన్న ఇబ్బందులు అయినా అధిగమిస్తారు. ధనలాభం.
పరిహారాలు: గోసేవ, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
తులారాశి: ప్రతికూలం. చేసే పనిలో నష్టం, కార్యనష్టం, వస్తునష్టం. అన్నింటా ఇబ్బందులు.
పరిహారాలు: శివరాధన చేసి పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి చెడుఫలితాలు పోతాయి.
వృశ్చికరాశి: కార్యజయం. మిశ్రమం. కార్యలాభం, శుభకార్య ప్రయత్నం, అలసట, అనవసర దూషణలు.
పరిహారాలు: వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయ దర్శనం మంచిచేస్తుంది.
ధనస్సురాశి: మిశ్రమ ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో ఇబ్బందులు, ఆందోళనలు.
పరిహారాలు: కుజగ్రహానికి ఎర్రవత్తులతో దీపారాధన, ఆరావళి కుంకుమ ధారణ మేలు చేస్తుంది.
మకరరాశి: అనుకూలం. కుటుంబంలో సఖ్యత, విందులు, పనులు పూర్తి.
పరిహారాలు: నల్ల గోవుకు దానవేయడం, నవగ్రహ ప్రదక్షణలు చేయండి.
కుంభరాశి: మిశ్రమం. కొత్త వస్తువులు కొంటారు, ధననష్టం, కార్యలాభం, అలసట.
పరిహారాలు: విష్ణు సహస్రనామార్చన, నల్ల పూలతో విష్ణుపూజ చేయండి.
మీనరాశి: మిశ్రమం. బంధువులరాక, అలసట, శ్రమ, పనుల్లో జాప్యం. కార్యలాభం.
పరిహారాలు: ఈశ్వరునికి పాయస నైవేద్యం, పేదలకు అన్నదానం చేయండి మంచి జరుగుతుంది.
– కేశవ