డిసెంబర్‌ 04 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

కార్తీకమాసం- డిసెంబర్‌- 4- శుక్రవారం.

మేషరాశి:ఈరోజు పనిలో విజయం సాధిస్తారు !

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు పనిలో విజయం సాధిస్తారు. శుభకరమైన ఖర్చులు పెరిగాయి. సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వస్తాయి. సానుకూల ఫలితాలు అందుకుంటారు. ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో అనుకోని మార్పులు రావచ్చు.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేయండి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు పెండింగ్‌ పనులు పూర్తి అవుతాయి ! 


ఈరోజు మీకు అనుకూలం . శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా మీ గౌరవం పెరుగుతుంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. ఆఫీస్‌లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకాన్ని తేనే, పెరుగుతో చేయించండి.

మిథునరాశి:ఈరోజు మీరు అదృష్టవంతులు !

ఈరోజు అనుకోని మంచి జరుగుతుంది. మీరు అదృష్టవంతులు. ఇంట్లో పెద్దల వల్ల ఇబ్బంది. ఆరోగ్యం బాగుండదు. వ్యాపారంలో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త. మీరు పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషంగా పెరుగుతుంది.

పరిహారాలుః శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.

కర్కాటకరాశి:ఈరోజు మీ మీద ఉన్న వత్తిడి తగ్గుతుంది !


గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఒత్తిడిని ఈ రోజు తగ్గవచ్చు. గ్రహాల చలనాల రీత్యా మీకు అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో మీరు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. ప్రయాణాలు అలసట కలిగిస్తాయి కానీ మీ పనులు నెరవేరుతాయి.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి దగ్గర చండీదీపారాధన చేయండి.

సింహరాశి:ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది!

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలసి వచ్చే రోజు. ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్య సూచన. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలుః శ్రీసూక్తంతో అమ్మవారికి పూజ చేయించండి.

కన్యరాశి:ఈరోజు లాభాలు వస్తాయి !


ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు సంతోషం పొందే సమయం. ధనం తగినంత ఉంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం. పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలను పొందుతారు. బంధువుల నుంచి ఇబ్బందులు వస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి సూక్తం పారాయణం చేయండి.

 

తులరాశి:ఈరోజు రాజకీయ రంగంలో విజయం సాధిస్తారు !


ఈరోజు అనుకూల ఫలితాలు. రాజకీయ రంగంలో మీరు విజయం సాధిస్తారు. సంతానం చదువుపై దృష్టి పెట్టండి. వైవాహిక జీవితంలో కూడా మీ ఆనందం పెరుగుతుంది. స్నేహితులు, బంధువులు కలవడం వల్ల మీ పనిలో కొన్ని పూర్తవుతాయి. ఈరోజు శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీసంతోషిమాతా పూజ, ఆరాధన చేయండి.

వృశ్చికరాశి:ఈరోజు ధనాభివృద్ధి !


ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. ఈరోజు గ్రహచలనం రీత్యా ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ఈరోజు ధనాభివృద్ధి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యంగా ఆహారం పై శ్రద్ధను పెట్టండి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీసూక్త పారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.

ధనస్సురాశి:ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనవసర వివాదాలు తలదూర్చకండి. ఈరోజు  ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరాశి వారు శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీసూర్యగ్రహారాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.

 

మకరరాశి:ఈరోజు రియల్‌ ఎస్టేట్‌ లాభాలు !


ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు రియల్ ఎస్టేటు వల్ల లబ్ది పొందుతారు. ఆఫీస్‌లో అనుకూల వాతావరణం. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తారు.

పరిహారాలుః శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

కుంభరాశిఈరోజు ఏ పనిచేసినా లాభాలు పొందుతారు !


ఈరోజు అదృష్టం మిముల్ని వరిస్తుంది. గ్రహాల శుభ దృష్టి వల్ల ఈ రోజు అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు ఏ పని చేసిన విపరీతమైన లాభం పొందుతారు. కుటుంబంలో సంబురాలు, సంతోషం. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః పసుపు, గంధంతో శివాభిషేకం చేయించండి.

మీనరాశి:ఈరోజు ఆర్థిక లాభాలు అందుతాయి !

ఈరోజుమంచిగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. ఈరోజు ఆఫీస్‌ పనులలో విజయాన్ని పొందుతారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఈ రోజు జీవిత భాగస్వామితో చిన్న వివాదం రావచ్చు, కానీ చివరకు సంతోషంగా అవి సద్దుమనుగుతాయి.

పరిహారాలుః శ్రీదుర్గాదేవిని ఆరాధించండి. అనుకూల ఫలితాలు పొందండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news