డిసెంబర్‌ 26 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ – 26 – మార్గశిర మాసం – శనివారం.

 

 మేష రాశి:ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు బాగుంటుంది. ధన యోగం కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఆర్థిక లాభం కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం కలుగుతుంది. మీరు పోగొట్టుకున్న డబ్బును అందుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు జాగ్రత్తగా మాట్లాడండి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. వాహనాల మీద ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీ తోబుట్టువులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు తెలియని వారితో అనవసరపు వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టం జరిగే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు రుణ విమోచన గణేశ స్తోత్రం చదువుకోండి అంతా శుభం జరుగుతుంది.

 

మిధున రాశి:ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజంతా ఆనందంగా ఉంటారు. ధన లాభం కలుగుతుంది. ఈరోజు బాగుంటుంది. మీరు ఏ పని చేసినా ఈరోజు కలిసి వస్తుంది. ఆనందంగా ఉంటారు. ఈరోజు విహార యాత్రలు చేస్తారు. ఒక ఉన్నత వ్యక్తి పరిచయం వల్ల మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు ధన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు శుభకార్యం చేసే అవకాశం ఉంది.

పరిహారాలుః  ఈరోజు లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 కర్కాటక రాశి:ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. ఈరోజు శత్రువులు మిత్రులు గా మారే అవకాశం ఉంది. ఈరోజు బంధువులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు దంపతులు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఖర్చు తక్కువ సంపద ఎక్కువ ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు, అనుకున్నది సాధిస్తారు. ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడి మీ జీవితం మారే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు విద్యార్థులు చదువుమీద దృష్టిని కేంద్రీకరిస్తారు. ధన లాభం కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న అప్పులు ఈరోజే తీరిపోతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఇంతకు ముందున్న అనారోగ్యాలు ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం కలుగుతుంది. ఈరోజు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు శుభకార్యం చేసే అవకాశం ఉంది. ఈరోజంతా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు.

పరిహారాలుః శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కన్యారాశి:ఈరోజు వ్యాపార లాభం కలుగుతుంది !

ఈరోజు కొంచెం ఇబ్బంది. ఈరోజు మీరు నమ్మిన వారు మోసం చేస్తారు.  ఈరోజు అధిక ధన యోగం కలుగుతుంది. ఈరోజు మీరు ఏ కార్యాన్ని తలపెట్టిన అది అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది. ఈరోజు కష్టపడి పనిచేయడం వల్ల లాభం ఉంటుంది. ఈరోజు  వివాహాది నిశ్చయతాంబూలాలకు అవకాశం. ఈరోజు ప్రయాణానికి అనుకూలమైన రోజు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది. ఈరోజంతా అయినా వాళ్ళు సహాయపడ్డారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి బాగుంటుంది.

 

 తులారాశి:కష్టాల నుంచి బయట పడతారు !

ఈరోజు అంతా బాగుంటుంది. ధన లాభం పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులకు బాగుంటుంది, లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు శత్రువులు మిత్రులు అవుతారు. ఈరోజు ప్రయాణాలకు మంచి రోజు. ఈరోజు అనేక రకాల కష్టాల నుంచి బయట పడతారు. కష్టాల నుంచి బయట పడతారు. ఈరోజు మీకు ఇష్టం లేని వారితో దూరంగా ఉంటారు. ప్రశాంతంగా దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులకు విద్య మీద శ్రద్ధ చూపుతారు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు.

పరిహారాలుః ఈ రోజు శ్రీలలితా అష్టోత్తర లలితా అష్టోత్తర అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:గౌరవాన్ని పొందుతారు !

ఈరోజు అన్నింటికీ అనుకూలమైన రోజు. విద్యార్థులు బాగా చదువుకొని పై చదువులకు వెళ్తారు. పోటీపరీక్షల్లో ఉన్నత ఉత్తీర్ణతను సాధిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు పై ఉన్నతాధికారులతో గౌరవాన్ని పొందుతారు. ఈరోజు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు సోదరులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యాపార లాభం కలుగుతుంది. ఈరోజు సమాజంలో గౌరవాన్ని కీర్తిని పొందుతారు.

పరిహారాలుః ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి:ఆర్థిక లాభం కలుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ ఉంటుంది. ఈ రోజు విద్యార్థులు చదువు మీద దృష్టిని కేంద్రీకరించడం మంచిది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లాభం కలుగుతుంది.  ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులకు బాగుంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి:వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద ఏకాగ్రతను చూపించండి. ఈరోజు మీ కోపాన్ని దూరం చేసుకోండి. ఈరోజు ఎవరితో తగాదాలు వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఇబ్బంది వస్తుంది. ఈరోజు ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. ఈ రోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.  ఈరోజు వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చెప్పుడు మాటలకు దూరంగా  ఉండండి. ఈరోజు డబ్బులు ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు తల్లిదండ్రులను గౌరవించండి. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

పరిహారాలుః ఈరోజు సుందరాకాండ పారాయణం చేసుకోండి అంతా శుభప్రదంగా ఉండండి.

 

కుంభరాశి:ప్రయాణాలకు అనుకూలమైన రోజు!

ఈరోజు బాగుంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు అన్నదమ్ములు సంతోషంగా ఉంటారు. ఈరోజు బంధువుల రాక. ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ రోజు భార్యభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు మీరు చేసే పనులను ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరే పూర్తి చేసుకోవడం మంచిది. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకుంటుంది.

 

 మీన రాశి:ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు స్నేహితుల ఎవరు శత్రువు ఎవరు అనేది తెలుసుకుంటారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకుంటారు. ఈరోజు దంపతులు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం కలిసి వస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందుతారు. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీమీనాక్షి అమ్మవారి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news