జనవరి 08 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

జనవరి –  8 – శుక్రవారం – మార్గశిర మాసం.

మేష రాశి: ప్రయాణాలు కలిసి వస్తాయి !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలిసివస్తాయి. ఈరోజు వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు !

ఈరోజంతా బాగుంటుంది. విద్యార్థులు ఈరోజు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో మంచి మార్కులు పొందుతారు. ఈరోజు విందు భోజనాలు చేస్తారు. ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు. ఈరోజు వ్యాపార వృత్తిలో ఉన్నవారు కొత్త వ్యాపారాలను పెట్టడం వల్ల లాభాలు కలిసొస్తాయి. ఈరోజు నూతన గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు సోదరులు కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు పెద్ద వారి మాటలను, సూచనలను పాటిస్తారు. పోగొట్టుకున్న డబ్బులను, వస్తువులను ఈరోజు పొందుతారు.

పరిహారాలుః లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి: ధన ప్రాప్తి కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్యాం ఈరోజు తొలగిపోతుంది. ఈరోజు ధన ప్రాప్తి కలుగుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు అన్నదమ్ములతో సక్కతగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి: ఈరోజు అందరన్ని ఆకట్టుకుంటారు !

ఈరోజంతా బాగుంటుంది. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటారు, వాళ్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటారు. ఇబ్బందుల నుంచి ఈరోజు బయట పడతారు. ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగం లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో అందరన్ని ఆకట్టుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఇంతకుముందు చేసిన తప్పులను తెలుసుకొని ఈరోజు పశ్చాత్తాప పడతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు, తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయ నిర్మాణానికి సహాయపడతారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజంతా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న అన్ని కష్టాల నుంచి ఈరోజు బయట పడతారు. ఈరోజు సంతోషంగా ఉంటారు. రాజయోగం కలుగుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఏ పని తలపెట్టినా కచ్చితంగా దాని మీద శ్రద్ధ పెట్టి పూర్తి చేసుకుంటారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలుః ఈరోజు శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి: ఈరోజు క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు అన్నతమ్ములతో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈరోజు గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారం లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. ఈరోజు మీ సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.

పరిహారాలుః ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

తులారాశి: ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు అంతా బాగుంటుంది. అప్పుల బాధలు నుంచి బయట పడతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీ సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: ఈరోజు వ్యాపార లాభాలు కలుగుతాయి !

నిన్నటి వరకు మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూస్తే ఈరోజు మీకు క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది. ఈరోజు విలువైన స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు తెలివిగా అందర్నీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకు ముందున్న అనారోగ్యాలన్నీ ఈరోజు నయమవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఆర్థికాభివృద్ధి పెరుగుతోంది. ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి: ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు అంతా బాగుంటుంది. ఈరోజు నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. మీ గృహంలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు వివాహ నిశ్చయ తాంబూలాలు ఫలిస్తాయి. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పరిహారాలుః సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజంతా బాగుంటుంది. ఈరోజు ఏ కొత్త పనులు తలపెట్టిన కలిసివస్తాయి. ఈ రోజు అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు, ఇంతకు ముందున్న అనారోగ్యాలు దూరమవుతాయి. ఈరోజు గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి: ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు సహాయంగా ఉంటారు. వ్యాపార లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఈరోజు మీ గృహంలో ఏదైనా దైవకార్యం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః ఈరోజు అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి: ఈరోజు వ్యాపార లాభాలు కలుగుతాయి !

ఈరోజు ఏదైనా ఆలోచించి చేయడం వల్ల కలిసి వస్తాయి. భార్యభర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఏమైనా వస్తువులను క్రయవిక్రయాలు చేయడానికి అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...