జనవరి 17 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ పుష్యమాసం – జనవరి – 17- ఆదివారం.

 

మేష రాశి:ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్నదమ్ముల తో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు దశ మాత స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం లాభం పొందుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని బాగుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రైవేట్ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఇంతకు ముందునా బకాయిలను వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు.

పరిహారాలుః గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను నిజాయితీతో అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఇంతకు ముందు జరిగిన తప్పులను, పొరపాట్లను ఈరోజు సవరించుకొని తిరిగి తప్పు చేయకుండా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం తెచ్చుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు అప్పుల బాధలు తగ్గిపోతాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఉద్యోగస్తులు అనుకున్న స్థానాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు తగ్గిపోతాయి. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని కోరుకుంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ధన లాభం పొందుతారు !

ఈరోజు చాలా బాగుంటుంది. మంచి ప్రయోజనాలను అందుకుంటారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న శుభ కార్యం ఫలిస్తుంది. పెద్ద వారి సలహాలను పాటిస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. ధన లాభం పొందుతారు. కొత్త గృహాన్ని కాని స్థలాన్ని కాని కొనుగోలు చేస్తారు. విద్యార్థులం బాగా కష్టపడి చదువుకొని ఉన్నత చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపారాల నిమిత్తం ఉంచుకొని లాభాలు పొందుతారు.

పరిహారాలుః శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు అనారోగ్యం తగ్గిపోతుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు, కీర్తిని పొందుతారు. గొప్ప పేరు తెచ్చుకుంటారు. ఉన్నత వ్యక్తిగా  పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు, అనారోగ్యం తగ్గిపోతుంది. పెద్ద మనిషిగా సలహాలు సూచనలను ఇస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో విజయం సాధిస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

  తులారాశి:ఈరోజు ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఇంతకు ముందు పోయిన వస్తువులను తిరిగి పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మానసికంగా ప్రశాంతతగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులుకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వివాహ సంబంధ చర్చలు ఫలిస్తాయి. అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు కలిసి మెలిసి ఉంటారు.

పరిహారాలుః శ్రీ రామ నామ పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే.

 

 వృశ్చిక రాశి:ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు వ్యక్తులతో అనవసరపు ఈ విషయాలను చర్చించడం మంచిది కాదు. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. అనవసరపు వ్యక్తులకు సేవ చేసి బాధ పడడం మంచిది కాదు. విద్యార్థులు గర్వంగా ఉండకుండా చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. స్త్రీలు చెప్పిన మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి, శివుడికి అభిషేకం చేయించుకోండి శుభ ఫలితాలు ఫలితాలు కలుగుతాయి.

 

ధనస్సు రాశి:నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు !

ఈరోజు ఆనంద యోగంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పెద్ద మనిషిగా సమాజంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు. ఉద్యోగంలో ఉత్తమ ఉద్యోగులుగా పేరు పొందుతారు. వ్యాపారాభివృద్ధి పెరిగి ధన లాభం పొందుతారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని వ్యాపార భాగస్వామిగా చేసుకుంటారు. సంతానం విషయంలో మంచి వార్తలు వింటారు.

పరిహారాలుః ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం పెట్టుకోండి.

 

మకర రాశి:ఈరోజు పోటీపరీక్షల్లో రాణిస్తారు !

ఈరోజు బాగుంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఇంతకు ముందు జరిగిన తప్పుల్ని సర్దుకుపోయి ఇక ముందు తప్పులు చేయకుండా ఉంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.

పరిహారాలుః దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కుంభరాశి:దేవాలయ దర్శనం చేసుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. వ్యాపారంలో లాభాలు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం చేసుకోండి.

 

మీన రాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు నమ్మిన స్నేహితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీ సొంతంగా మీరే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో క్రమశిక్షణ లేక తప్పు చేసే అవకాశం ఉంటుంది. విలువైన వస్తు, ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోయే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు ఒక్కరు ప్రయాణం చేయకుండా అయిన వారితో కలిసి చేయడం మంచిది. అనవసరపు వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువు మీద దృష్టి పెట్టడం మంచిది, అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది, కందులను ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల మంచి కలుగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version