మార్చి 2 శనివారం – రోజువారి రాశిఫలాలు

-

సుబ్రమణ్యస్వామికి ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే మీకంతా శుభమే!

March 2, 2019 today rasi phalalu

మేషరాశి: ప్రతికూల ఫలితాలు, పనుల్లో జాప్యం, వ్యతిరేక ఫలితాలు, స్త్రీలతో విరోధాలు.
పరిహారాలు: సుబ్రమణ్యస్వామికి ఎర్రవత్తులతో దీపారాధన లేదా చాలీసా పారాయణం చేయండి. వీలైతే దేవాలయ ప్రదక్షణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభరాశి: ప్రతికూల ఫలితాలు, కార్యనష్టం, ధననష్టం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి గోధుమ/బియ్యపు పిండితో దీపం చేసి రెండువత్తులు వేసి దీపారాధన, ధ్యానం చేసుకోండి మంచి జరుగుతుంది.

మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, ధనలాభం, వ్యసనాల వల్ల ధననష్టం, స్నేహితులతో లాభం. సమయం వృథా.
పరిహారాలు: వేంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, ప్రదక్షణలు లేదా చాలీసా పారాయణం, సింధూర ధారణ చేయండి. శనివార నియమం పాటించండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి: అనుకూల ఫలితాలు, అదాయ వృద్ధి, కార్యజయం, చిన్నచిన్న సమస్యలు ఉన్నా అధిగమిస్తారు, వాహనలాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, చాలీసా పారాయణం చేసుకోండి.

సింహరాశి: అనుకూల ఫలితాలు, ఆనందం, ధనలాభం, వస్తులాభం, విందులు.
పరిహారాలు: గోసేవ/విష్ణుసహస్రనామ పారాయణం లేదా హనుమాన్ దేవాలయప్రదక్షణలు చేయండి.

కన్యారాశి: మిశ్రమ ఫలితాలు, పిల్లలకు అనారోగ్యం, అధిక ఖర్చులు, ప్రభుత్వ మూలక కార్యజయం.
పరిహారాలు: చాలీసా పారాయణం/అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

తులారాశి: మిశ్రమ ఫలితాలు, అశుభం, కలహాలు, కీర్తి, పనులు పూర్తి.
పరిహారాలు: దగ్గర్లోని దేవాలయంలో ప్రదక్షణలు, దానం, ధర్మం చేయండి.

వృశ్చికరాశి: అనుకూల ఫలితాలు, ప్రయాణ సౌఖ్యం, లాభం, ధనలాభం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు సహాయం లేదా దానం, ధర్మం.

ధనస్సురాశి: మిశ్రమం, తల్లి లేదా వర్గీయులకు అనారోగ్య సూచన, విందులు, ఆనందం.
పరిహారాలు: దుర్గాదేవికి దీపారాధన, ఆరావళి కుంకుమ ధారణ చేయండి.

మకరరాశి: అనుకూలం, ఆకస్మిక ధనవ్యయం, వస్తులాభం, పనులు పూర్తి.
పరిహారాలు: దేవాలయ దర్శనం,ప్రదక్షణలు. సింధూర ధారణ చేయండి.

కుంభరాశి: ప్రతికూల ఫలితాలు, అకారణ కలహాలు, నష్టం, ధనవ్యయం.
పరిహారాలు: చాలీసా/విష్ణు సహస్రనామ పారాయణం, సింధూర ధారణ చేయండి.

మీనరాశి: ప్రతికూల ఫలితాలు, ఆందోళన, పనుల్లో ఇబ్బందులు, అకారణ నష్టాలు.
పరిహారాలు: విష్ణు సహస్రనామాలను శ్రవణం/పఠనం చేయండి. లేదా ఆంజనేయస్వామి దేవాలయ ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.

నోట్: నారాయణ సేవ అంటే మీకు చాతనైనంతలో ఎవరికో ఒకరికి అంటే పేదవారు, యాచకులు, వికలాంగులకు అన్నదానం చేయండి. అదీ వీలుకాకుంటే దగ్గర్లోని జీహెచ్‌ఎంసీ ఐదురూపాయల భోజన కేంద్రంలో పదో/ఇరవైయ్యో మీకు చాతనైనంత ఇచ్చి నలుగురికి భోజనం పెట్టమనండి. తప్పక మీకు మేలు జరుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news