ఐఆర్‌సీటీసీ ఐపే వల్ల పేమెంట్ ఫెయిల్యూర్స్ సమస్యలు సులభంగా పరిష్కారం అవడమే కాదు, దాంతో వారు సులభంగా పేమెంట్లు కూడా చేయవచ్చు. అందుకు గాను కస్టమర్లు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లలో దేంతోనైనా పేమెంట్ సులభంగా చేసేలా ఐపే పేమెంట్ గేట్‌వేను డెవలప్ చేశారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తన వెబ్‌సైట్‌లో ప్రయాణికుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ ఐపే (IRCTC iPay) పేరిట ఓ నూతన పేమెంట్ గేట్ వేను ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రయాణికులకు పేమెంట్ చేసే సమయంలో తలెత్తే సమస్యలు చాలా సులభంగా పరిష్కారమవుతాయి.
ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీలో చెల్లింపులు చేయాలంటే థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేలు ఉండేవి. వాటిని ఉపయోగించి నగదు చెల్లింపు చేసేటప్పుడు ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా పేమెంట్స్ ఫెయిల్ అయితే డెబిట్ అయిన నగదును మళ్లీ క్రెడిట్ చేసేందుకు ఐఆర్‌సీటీసీకి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ క్రమంలో రీఫండ్ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యేది. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఐపే పేమెంట్ గేట్ వే ఆ సంస్థకు చెందినదే. దాంతో నేరుగా బ్యాంకులకు సంబంధాలు ఉంటాయి. అందువల్ల పేమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఐఆర్‌సీటీసీ నేరుగా బ్యాంకును సంప్రదిస్తుంది. దీంతో కస్టమర్లకు రీఫండ్ అమౌంట్ త్వరగా క్రెడిట్ అవుతుంది.
అయితే ఐఆర్‌సీటీసీ ఐపే వల్ల పేమెంట్ ఫెయిల్యూర్స్ సమస్యలు సులభంగా పరిష్కారం అవడమే కాదు, దాంతో వారు సులభంగా పేమెంట్లు కూడా చేయవచ్చు. అందుకు గాను కస్టమర్లు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లలో దేంతోనైనా పేమెంట్ సులభంగా చేసేలా ఐపే పేమెంట్ గేట్‌వేను డెవలప్ చేశారు. దీని వల్ల ఐఆర్‌సీటీసీలో టిక్కెట్లను కొనుగోలు చేసినా, హోటల్స్‌ను బుక్ చేసినా చాలా వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ క్రమంలోనే త్వరలో ఐఆర్‌సీటీసీ ప్రీపెయిడ్ కార్డ్ కమ్ వాలెట్‌ను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తేనుంది. దాంతో కూడా చాలా సులభంగా చెల్లింపులు చేసేలా సదుపాయాలను అందుబాటులోకి తేనున్నారు..!