మార్చి 20 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

 

మార్చి 20 – ఫాల్గుణ మాసం – శనివారం.

మేషరాశి:ఇబ్బందులు ఎదురవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల తొందరపాటుతనం వల్ల నష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలించవు. వాహన ప్రయాణాలు అశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకుని స్వామివారికి సింధూరం వేయించండి.

todays horoscope

వృషభరాశి:విజయం సాధిస్తారు !

ఈ రోజు బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు చర్చలు అనుకూలిస్తాయి. ఇతరులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

మిధునరాశి:అనవసర ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. మీలో ఉన్న కోపం వల్ల చికాకుల వల్ల మీ ప్రాణస్నేహితులు మీకు దూరం అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు కష్టపడి చదువు కోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమస్యలు ఎదురవుతాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీవెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి:శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు వస్తాయి. గొప్ప వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

సింహరాశి:ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. శ్రమాధిక్యత. అంతా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగస్తుల కార్యాలయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.
పరిహారాలుః ఈరోజు శ్రీగురుదత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

కన్యారాశి:బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారం భాగస్వాముల వల్ల అధిక లాభాలు వస్తాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువుల కలయికతో సంతోషం. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి:నష్టం కలుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమస్యలు ఎదురవుతాయి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినక పోవడం వల్ల నష్టం కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో ఆటంకాలు. స్వల్ప నష్టాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి:అధిక లాభాలు వస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. ధన లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు వస్తాయి. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు.  శత్రువులు కూడా మిత్రులు అవుతారు. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడి చదువు కొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి  మార్కులు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః  ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

ధనస్సురాశి:ఈరోజు బాగుంటుంది !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. సంతోషంగా ఉంటారు. అనారోగ్యానికి దూరంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. రుణ బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. సోదరులతో ఆనందంగా సఖ్యతగా ఉంటారు.

పరిహారాలుః  ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

మకరరాశి:సోదరులతో విభేదాలు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. మీలో ఉన్న కోపం వల్ల, చికాకు వల్ల అవమానం కలుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఏర్పడుతాయి.  దీనివల్ల మీకు నష్టం కలుగుతుంది. సోదరులతో విభేదాలు కలుగుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం మంచిది. చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. మీ అంతట మీరే తప్పులు చేస్తారు. తర్వాత బాధపడతారు.
పరిహారాలుః  ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

కుంభరాశి:వ్యాపారాల్లో నష్టం ఏర్పడుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు స్నేహితులతో కలసి చదువును నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారాల్లో నష్టం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. ప్రశాంతత కోల్పోతారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీనరాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. గతంలో వసూలు గాని మొండి బకాయిలు తిరిగి వసూలు చేసుకుంటారు. వివాహాది నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. పెద్ద వారిని గౌరవిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. క్రొత్త ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాలు ప్రారంభం  చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తే అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ