ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత మార్కెట్లో కొత్త 4కె ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ పేరిట అమెజాన్ ఆ టీవీలను విడుదల చేసింది. అమెజాన్ ఫైర్ టీవీ ఎడిషన్‌లో 50, 55 ఇంచుల డిస్ప్లే సైజుల్లో ఆ టీవీలు లభిస్తున్నాయి. ఈ టీవీలలో అమెజాన్ ఫైర్ ఓఎస్ లభిస్తతుంది. 20 వాట్ల స్పీకర్లు, డాల్బీ అట్మోస్, అలెక్సా వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి.
ఈ టీవీలలో 1.95 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉంటుంది. వైఫై వస్తుంది. ఇన్‌బిల్ట్ అలెక్సాతో సులభంగా కంటెంట్‌ను సెర్చ్ చేయవచ్చు. ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, సోనీ లివ్, వూట్, డిస్కవరీ ప్లస్ వంటి ఓటీటీ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. బ్లూటూత్ 5.0, యూఎస్బీ పోర్టులు, ఈథర్నెట్ పోర్టు, ఆప్టికల్ పోర్టు, ఏవీ పోర్టులు ఉన్నాయి.
అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ ఎడిషన్ 50 ఇంచుల టీవీ ధర రూ.29,999 గా ఉంది. అలాగే 55 ఇంచుల మోడల్ ధర రూ.34,999గా ఉంది. వీటిని అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. ఇక త్వరలోనే ఇదే సిరీస్‌లో 43, 32 ఇంచుల టీవీ మోడల్స్‌ను కూడా అమెజాన్ విడుదల చేయనుంది.