బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్లేయ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ అయిన‌ప్ప‌టి నుంచి ఇబ్బందులు..

బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను ఆడుతున్నారా ? ఈ గేమ్‌కు కొత్త వెర్ష‌న్‌ను క్రాఫ్ట‌న్ కంపెనీ ఇటీవ‌లే 1.5.0 పేరిట విడుద‌ల చేసింది. అయితే ఈ వెర్ష‌న్‌కు అప్ డేట్ అయ్యాక గేమ్‌లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా గేమ్ లోడ్ అయ్యే స‌మ‌యంలో, లాగిన్ అయ్యేట‌ప్పుడు, రివార్డుల‌ను పొందే స‌మ‌యంలో, ప‌ర్చేస్ చేసే స‌మ‌యంలో, యూనికార్న్ అనే ఔట్‌ఫిట్‌ను ధ‌రించే స‌మ‌యంలో గ్లిచ్‌లు వ‌స్తున్నాయ‌ని, గేమ్ ప‌నిచేయ‌డం లేద‌ని ఫిర్యాదులు చేస్తున్నారు.

అయితే ఈ స‌మ‌స్య‌పై క్రాఫ్ట‌న్ స్పందించింది. యూనికార్న్ ఔట్ ఫిట్‌, లోడింగ్ స్క్రీన్ స‌మ‌యాల్లో గేమ్ లో స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌మాట నిజ‌మే అని తెలిపింది. దీనిపై తాము ఫిక్స్ ను అందించే ప్ర‌యత్నం చేస్తున్నామ‌ని, అందువ‌ల్ల అతి త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపింది. ఈ మేర‌కు క్రాఫ్ట‌న్.. ఆ గేమ్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

ఇక లాగిన్ 2 స్ రివార్డును పొందే క్ర‌మంలోనూ స‌మ‌స్య వ‌స్తుంద‌ని, ఇది జూలై 8 నుంచి ప్రారంభ‌మైంద‌ని క్రాఫ్ట‌న్ తెలియ‌జేసింది. ఈ స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రిస్తున్నామ‌ని తెలిపింది. ఇక గేమ్‌లో భాగంగా యూసీని కొన్నాక అకౌంట్‌లో యాడ్ అవ‌డం లేద‌ని, అలాగే కొన్ని ఐట‌మ్స్ ను ప‌ర్చేస్ చేసేట‌ప్పుడు కూడా స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని యూజ‌ర్లు తెల‌ప‌గా.. వాటిని కూడా ప‌రిష్క‌రిస్తామ‌ని క్రాఫ్ట‌న్ తెలియ‌జేసింది.

కాగా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌కు గాను ఆగ‌స్టు 2 నుంచి 8 వ‌ర‌కు టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుంది. ఆస‌క్తి ఉన్న‌వారు అందులో పాల్గొన‌వ‌చ్చు.