BSNL బంపర్ ఆఫర్: ఫ్రీ వైఫై మాట్లాడితే డబ్బులిస్తార‌ట‌..

-

జియో ఇంటర్నెట్ వచ్చాక… మొబైల్ ఆపరేటర్ల మధ్య పోటీ బాగా పెరిగింది. ఒకరికి మించి ఒకరు భారీ ఆఫర్లు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పునర్వైభవాన్ని తెచ్చుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత వైఫై, ఎక్కువసేపు మాట్లాడితే తిరిగి మేమే చెల్లిస్తామని వినియోగదారులకు చెబుతుంది. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు నెల పాటు ఉచితంగా బ్రాడ్‌ బ్యాండ్‌, వైఫై సేవలు అందిస్తామన్నారు.

ల్యాండ్‌ లైన్‌ వినియోగదారులు 5 నిమిషాలకు పైబడి అవుట్‌గోయింగ్‌ కాల్‌ మాట్లాడితే ఎదురుగా 6 పైసలు చెల్లిస్తాం. ఇలా అపరిమితంగా చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉచిత బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌లో నెల రోజుల పాటు 10mbps స్పీడ్‌తో రోజుకు 5gb వరకు ఉచితంగా ఇంటర్‌నెట్‌ వినియోగించుకోవచ్చు. ఆ తరువాత కనీస ప్లాన్‌ నెలకి రూ.349 (రోజుకి 2gb, 8mbps స్పీడ్‌) నుంచి మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version