బ‌డ్జెట్ యాప్.. వివరాలన్నీ క్ష‌ణాల్లోనే ల‌భ్యం..!

-

ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఆమె బ‌డ్జెట్ యాప్‌ను లాంచ్ చేశారు. అందులో బ‌డ్జెట్‌కు సంబంధించిన అన్ని వివ‌రాల‌ను పొందు ప‌రిచారు. అందువ‌ల్ల బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గానే దానికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను ఆ యాప్‌లో తెలుసుకోవ‌చ్చు. ఈ యాప్ అంద‌రికీ అందుబాటులో ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

కాగా బ‌డ్జెట్ యాప్‌ను నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మ‌టిక్స్ సెంట‌ర్ (ఎన్ఐసీ) డెవ‌ల‌ప్ చేసింది. పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన మ‌రుక్ష‌ణ‌మే ఈ యాప్‌లో బ‌డ్జెట్‌కు సంబంధించిన అన్ని వివ‌రాల‌ను ప్ర‌జ‌లు తెలుసుకోవ‌చ్చు. బ‌డ్జెట్ డాక్యుమెంట్లు అన్నీ ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

యాప్‌లో బ‌డ్జెట్ ప‌త్రాలు ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంటాయి. బ‌డ్జెట్ ప‌త్రాల‌ను సుల‌భంగా యాక్సెస్ చేసేవిధంగా యాప్‌ను యూజ‌ర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. ఈ క్ర‌మంలో బ‌డ్జెట్ ప‌త్రాల‌ను ఎవ‌రైనా స‌రే సులభంగా డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవ‌చ్చు. అలాగే పేజీల‌ను జూమ్ చేసుకుని వాటిల్లో ఉండే వివ‌రాల‌ను చ‌ద‌వ‌చ్చు. కాగా క‌రోనా నేప‌థ్యంలో మొద‌టి సారిగా కేంద్రం పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version