పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ల బదిలీల ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బదిలీ చేయమని తాను ఆదేశించలేదని మీడియా సమావేశంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిమ్మగడ్డ ఆదేశాలతో బదిలీ చేశామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా నిమ్మగడ్డ బదిలీ ఆదేశాల కాపీలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25 న సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ కు రెండు దఫాలుగా నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసినట్టు గుర్తించారు.
ఓటర్ల జాబితా తయారీలో విఫలమయ్యారని ఆక్షేపిస్తు బదిలీ చేయాలని సీఎస్ కు నిమ్మగడ్డ ఆదేశించారు. వారి స్థానంలో మూడు పేర్లతో ప్రతిపాదిత జాబితా పంపాలని లేఖలో స్పష్టం చేశారు నిమ్మగడ్డ. అదే రోజు పరస్పర విరుద్దంగా మరో లేఖను కూడా నిమ్మగడ్డ పంపారు. ఆదేశించకపోయినా తన ఆదేశాలతో బదిలీ చేసినట్లు మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మరో లేఖ రాశారు నిమ్మగడ్డ. ఈ భిన్న లేఖలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.