స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. మెటా యాజమాన్యలోని వాట్సాప్ కంపెనీ యూజర్ల సెక్యూరిటీ, సౌకర్యార్థం కోసం కొత్త కొత్త అప్‌డేట్స్‌ను ఎప్పుడు కూడా తీసుకొస్తూనే వుంది. అయితే ఒక్కోసారి తెలీని వాళ్ళ నుండి కూడా మెసేజెస్, కాల్స్ వచ్చేస్తూ వుంటారు. అలా కాకుండా మీ ప్రొఫైల్ ఫోటో కొందరికే కనిపించేలా చేయాలంటే వాట్సాప్ సెట్టింగులలో కొన్ని మార్పులు చేయాలి. వాట్సాప్ చాట్ లిస్టు లో మీరు ఎవరితో అయినా సీక్రెట్‌గా చాట్ చేయాలనుకుంటే ఆ చాట్ ని లాక్ చేసుకోవచ్చు.
అలానే వాట్సాప్ లో వచ్చిన మెసెజెస్ చూసినట్టు ఇతరులకు తెలియకూడదంటే మీరు సెట్టింగులో ప్రైవసీ ఆప్షన్స్‌లో read receipts ని ఆఫ్ చేయండి. ప్రైవసీ సెట్టింగులో కాల్స్ ఆప్షన్2పై క్లిక్ చేసి Silence Unknown Callersని ఆన్ చేస్తే మీకు తెలీని వాళ్ళు ఫోన్ చేయడానికి కుదరదు.
సో ఇలా చేసుకోవచ్చు. వాట్సాప్ ప్రైవసీ మరింత కొనసాగించేందుకు ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ చేయొచ్చు. వాట్సాప్ లో మిమ్మల్ని గ్రూపులో ఎవరు యాడ్ చేయాలనే ఆప్షన్‌ను కూడా ఎంపిక చెయ్యచ్చు. వాట్సాప్ లో స్టేటస్ ని హైడ్ చెయ్యచ్చు. అలానే మీరు అవసరం లేనివాళ్ళని బ్లాక్ చేసుకోవచ్చు.