గూగుల్ లెన్స్‌తో ఎన్ని ప్రయోజనాలను పొందచ్చో తెలుసా..?

-

గూగుల్ లెన్స్‌ ఫీచర్‌ వలన చాలా ఉపయోగాలు వున్నాయి. గూగుల్ లెన్స్‌ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ లేదా డిసేబుల్ కూడా చెయ్యచ్చు. గూగుల్ లెన్స్ ఆండ్రాయిడ్ వర్షన్ గూగుల్ క్రోమ్ లో కూడా మనకి అందుబాటులో ఉంది. అయితే దీని వలన ఉపయోగం ఏమిటంటే ఇమేజ్ లోని టెక్స్ట్ ను సెర్చ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది.

 

ఇమేజ్ ను ట్రేస్ చెయ్యడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఒక ఇమేజ్ పై ఫింగర్ హోల్డ్ చేసి “సెర్చ్ విత్ గూగుల్ లెన్స్” అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరి పోతుంది. ఏదైన ఒక వెబ్ పేజీలోని టెక్స్ట్ ని గూగుల్ లెన్స్ సహాయంతో స్పీకర్ ద్వారా వినవచ్చు. ఇలా దీని వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. డెస్క్‌టాప్ వర్షన్‌లో అయితే మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇక ఎలా ఎనేబుల్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.

దీని కోసం ముందు క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో Chrome://flags అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
తర్వాత సెర్చ్ బార్‌లో గూగుల్ లెన్స్ అని టైప్ చేయాలి.
నెక్స్ట్ “సెర్చ్ యువర్ స్క్రీన్ విత్ గూగుల్ లెన్స్” అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది.
దీని పక్కనే డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది.
అక్కడ క్లిక్ చేసి ఎనేబుల్డ్ అనే ఆప్షన్ ఎంచుకోండి.
అలానే దీన్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు.
కావాలంటే గూగుల్ లెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version