సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఛార్జ్ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎక్స్ (ట్విటర్)లో మరో క్రేజీ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అవేంటంటే..?
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఈ ఫీచర్లు ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలిపేందుకు స్క్రీన్ షాట్‌ను కూడా పోస్టు చేశారు.
‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’ గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకువస్తనని ఎలాన్ మస్క్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్లు అందరికీ అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ‘Settings’లోకి వెళ్లి ‘Privacy & Safety’ ఆప్షన్‌పై క్లిక్ చేసి‘Direct Messages’ ఆప్షన్‌ను ఎంచుకొని ‘Enable Audio & Video Calling’ ఫీచర్‌ని ఎనేబల్ చేసుకోవాలి.
Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023