ఈ రోజు వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు మాజీ ఛాంపియన్ శ్రీలంకల తలపడనున్నాయి. బెంగుళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో రెండు జట్లు గెలుపే ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. రెండు జట్లూ కూడా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా, వాటిలో ఒకటి మాత్రమే గెలిచి మూడు ఓటములను సొంతం చేసుకుని చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నాయి. ముఖ్యంగా డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆట మరీ దారుణంగా ఉంది. ఈ మ్యాచ్ లో పొరపాటున కనుక ఇంగ్లాండ్ ఓడిపోతే ఇక సెమీస్ కు వెళ్ళడానికి అవకాశం అస్సలు ఉండదు. ఎటువంటి సమీకరణాలతో పని లేకుండా ఇంటిదారి పట్టడమే. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఓటములు ఎందుకు వస్తున్నాయో టీం యాజమాన్యం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంగ్లాండ్ టీం లో బట్లర్, రూట్, బెయిర్ స్టో, స్టోక్స్ లు అంచనాలకు అనుగుణంగా రాణిస్తే ఇంగ్లాండ్ ఇప్పటికీ కప్ కొట్టగలదు అని చెప్పడంలో ఎటువంటు సందేహం లేదు. మరి శ్రీలంకను ఓడించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుందా అన్నది చూడాలి.