ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. మంగళవారం నుంచి బిగ్ సేవింగ్ డేస్ పేరిట మరో నూతన సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 27వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే రాయితీలు, ఆఫర్లను అందిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్లపై డీల్స్
శాంసంగ్
* గెలాక్సీ ఎ80 (8జీబీ+128జీబీ) – రూ.30వేల తగ్గింపు ధరతో రూ.21,999కు లభ్యం
* గెలాక్సీ ఎస్10 లైట్ (8జీబీ+128జీబీ) – హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.4వేలు తగ్గింపు – రూ.38,999కు లభ్యం
* గెలాక్సీ ఎస్20 సిరీస్ – హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.4వేలు తగ్గింపు – రూ.66,499 నుంచి లభ్యం
ఆపిల్
* ఐఫోన్ ఎస్ఈ 2020 – హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.3600 తగ్గింపు – రూ.38,900 నుంచి లభ్యం
* ఐఫోన్ 7 (32జీబీ) – రూ.1401 తగ్గింపు – రూ.28,499కు లభ్యం
* ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) – రూ.2901 తగ్గింపు – రూ.34,999కు లభ్యం
* ఐఫోన్ ఎక్స్ఎస్ (64జీబీ) – రూ.30,901 తగ్గింపు – రూ.58,999కు లభ్యం
* ఐఫోన్ ఎక్స్ఆర్ – రూ.1400 తగ్గింపు – రూ.48,500 నుంచి లభ్యం
* ఐఫోన్ 11 సిరీస్ – హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.5వేలు తగ్గింపు – రూ.63,600 నుంచి ధర ప్రారంభం
గూగుల్
* పిక్సల్ 3ఎ (4జీబీ+64జీబీ) – రూ.10వేలు తగ్గింపు – ధర రూ.29,999
వివో
* నెక్స్ (8జీబీ+128జీబీ) – రూ.16వేలు తగ్గింపు – ధర రూ.23,990
* జడ్1ఎక్స్ (6జీబీ + 64జీబీ) – రూ.5వేలు తగ్గింపు – ధర రూ.14,990
* జడ్1ఎక్స్ (8జీబీ + 128జీబీ) – రూ.8వేలు తగ్గింపు – ధర రూ.16,990
షియోమీ
* రెడ్‌మీ కె20 – రూ.20,499 నుంచి ప్రారంభం
* రెడ్‌మీ కె20 ప్రొ – రూ.23,499 నుంచి ప్రారంభం
* షియోమీ ఎంఐ మిక్స్ 2 (6జీబీ + 128జీబీ) – రూ.23వేలు తగ్గింపు – ధర రూ.14,999
రియల్‌మి
* రియల్‌మి ఎక్స్2 ప్రొ – ధర రూ.25,999 నుంచి ప్రారంభం
* రియల్‌మి ఎక్స్ – రూ.2వేలు తగ్గింపు – ధర రూ.15,999 నుంచి ప్రారంభం
ఐక్యూ
* ఐక్యూ 3 – రూ.32,990 నుంచి ప్రారంభం
ఒప్పో
* రెనో 10ఎక్స్ జూమ్ – రూ.12వేలు తగ్గింపు – ధర రూ.26వేలు
* ఎ9 2020 (4జీబీ + 128జీబీ) – రూ.6వేలు తగ్గింపు – ధర రూ.12,990
పైన తెలిపిన స్మార్ట్‌ఫోన్ డీల్స్ మాత్రమే కాకుండా ల్యాప్‌టాప్‌లపై కూడా ఉత్తమమైన డీల్స్‌ను ఈ సేల్‌లో అందిస్తున్నారు. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, ఇంటెల్ కోర్ ఐ3, ఐ5, ప్రీమియం ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు.. తదితర ఉత్పత్తులపై కస్టమర్లు రాయితీలు, ఆఫర్లను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం (గరిష్టంగా రూ.1500 వరకు) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.